business

ఇండియాలో ఫాస్టెస్ట్ కారు.. రెండు లక్షల అమ్మ‌కాలు..

మారుతి సుజుకి ప్రాన్ ఎక్స్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ కార్ గా నిలిచింది. అయితే దీని సేల్స్ రెండు లక్షల వరకు చేరింది. కేవలం 17.3 నెలల్లో ఈ రికార్డును సృష్టించింది. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఏప్రిల్ 2023 లో విడుదల అయింది. అయితే ఫ్రాన్ ఎక్స్ మోడల్ లక్ష కార్లు 10 నెలల్లోనే సేల్ అయ్యాయి. పైగా మిగిలిన లక్ష కార్లు కేవలం 7.3 నెలల్లో జరిగాయి అని మారుతి చెప్పింది.

ఈ వెహికల్ కస్టమర్లను ఎంతో ఆకర్షించిందని టైర్ 1 మరియు టైర్ 2 సిటీలకు సంబంధించిన వారు కూడా కొనుక్కున్నారని తెలియజేసింది. పైగా ఎన్ సీ ఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు ఈ మోడల్ కార్లను ఎక్కువ సేల్ చేసి టాప్ ఫైవ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మోడల్ కు సంబంధించిన కార్లు లో ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి.

this car in india has been sold 2 lakh units

1.2 లీటర్ డ్యూయల్ జట్, ఐ వీవీటి పెట్రోల్, 1.0 లీటర్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ వంటి కొన్ని ఆప్షన్లు కూడా ఇచ్చారు. ఈ విధంగా ఎవరికి నచ్చిన ఆప్షన్ ను వారి వినియోగత బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాక సీఎన్జి కూడా ఈ మోడల్ లో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటి పెట్రోల్ ఇంజన్ కు CNG ఆప్షన్ ఉంది.

Peddinti Sravya

Recent Posts