వినోదం

మూవీ బాగుంది అనిపించినా ఖలేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది.. కార‌ణాలు ఇవేనా..?

కొన్ని సినిమాలు చూసిన వెంట‌నే విపరీతంగా న‌చ్చుతాయి. మ‌రికొన్ని సినిమాలు అప్పుడు అర్థం కాక‌పోయినా ఇంకోసారి ఎప్పుడైనా చూసినప్పుడు ఏదో కొత్త‌దనం ఉంద‌నిపిస్తుంది. అప్పుడేందుకు హిట్ అవ్వలేదు అనిపిస్తుంది. అలాంటి సినిమాల లిస్ట్ లో మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్ లో వచ్చిన ఖ‌లేజా సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా 2010లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఇంతకు ముందు అతడు నటించాడు. అతడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఖలేజా థియేటర్ లో మెప్పించకపోయినా టెలివిజన్ లో ఆకట్టుకుంది.

కొంతకాలానికి ఆ సినిమాలోని మ్యాజిక్ ను ప్రేక్ష‌కులు గుర్తించారు. అయితే ఖలేజా ఫ్లాప్ అవ్వ‌డానికి 5 కార‌ణాలు ఉన్నాయని విశ్లేష‌కులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దా.. 1.సినిమాలోని సీరియ‌స్ సీన్ల‌ను కూడా కామెడీగా చూపించేస‌రికి ప్రేక్ష‌కుడికి విసుగు పుట్టింది. అంతే కాకుండా కొన్నిసార్లు కామెడీ కూడా బోర్ కొట్టేలా ఉంటుంది. 2. త్రివిక్ర‌మ్ మ‌హేశ్ బాబు సినిమా అన‌గానే అత‌డు రేంజ్ లో ఊహించుకున్నారు. కానీ ఆ రేంజ్ లో సినిమా లేక‌పోవ‌డంతో నిరాశ‌చెందారు. 3. ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకున్న‌వాడే దేవుడని చెప్పే ప్ర‌య‌త్నం త్రివిక్ర‌మ్ చేశాడు.

this is the reason why khaleja movie is flop

కానీ ఆ పాయింట్ స‌రిగ్గా ప్ర‌జెంట్ చేయ‌లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌తిసారి దేవుడు అని చెప్ప‌డంతో మ‌నిషి దేవుడెలా అవుతాడు అనే క‌న్ఫ్యూజ‌న్ లో ప్రేక్ష‌కులు ప‌డిపోయారు. 4. ఏ సినిమా అయినా ఒక జోన‌ర్ కు సంబంధించిన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ ఖలేజా సినిమా కామెడీ, హార్ర‌ర్, యాక్ష‌న్ ఇలా ఒక ప్ర‌త్యేక జోన‌ర్ కు చెందిన‌ద‌ని చెప్ప‌లేం. 5. ఖలేజా సినిమాలో స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్న ప్ర‌జ‌ల‌ను చూపిస్తారు. కానీ అది ఎక్క‌డో ఉత్త‌రాది ప్రాంతం కావ‌డంతో ప్రేక్ష‌కులు దానికి క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోయారు. ఇలా అనేక కారణాలతో ఖలేజా మూవీ బాగున్నప్పటికీ హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది.

Admin

Recent Posts