Sleep : ప్రస్తుత కాలంలో మారిన మన ఆచార వ్యవహారాల కారణంగా చాలా మంది ఎటు పడితే అటు తల పెట్టి నిద్రిస్తున్నారు. ఎలా పడితే అలా నిద్రించడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఉత్తరం వైపున తలపెట్టి అస్సలు నిద్రించకూడదని పండితులు చెబుతున్నారు. మన పెద్దలు కూడా ఉత్తరం వైపున తలపెట్టి నిద్రించకూడదని చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఉత్తరం వైపున తలపెట్టి నిద్రించడం వల్ల త్వరగా మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కనీసం జంతువులు కూడా ఉత్తరం వైపున తలపెట్టి నిద్రించవని వారు తెలియజేస్తున్నారు.
ఉత్తరం వైపున తలపెట్టి నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన ఎక్కువవడంతో పాటు ఉదయం లేచిన వెంటనే మనం చురుకుగా పని చేసుకోలేకపోతాము. భూమికి దక్షిణ ధృవం, ఉత్తర ధృవం అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ ధృవాల వద్ద భూమి నొక్కబడి ఉంటుంది. అలాగే ఈ ధృవాల వద్ద ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మనలో ఉండే జీవనాడీ వ్యవస్థ ఎల్లప్పుడూ ఊర్థ్వ ముఖంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఉత్తర దిక్కున తల పెట్టి నిద్రించడం వల్ల మనలో ఉండే శక్తి అంతా తల ద్వారా ఆకర్షించబడుతుంది.
దీంతో శరీరం శిథిలమయ్యి, నశించి, త్వరగా వృద్ధాప్యం రావడంతో పాటు మరణం కూడా వస్తుందని పండితులు చెబుతున్నారు. మనం నిద్రించేటప్పుడు దక్షిణ దిక్కున తల ఉత్తరం వైపున కాళ్లు ఉండేలా నిద్రించాలి. అలాగే ఇలా నిద్రిస్తూనే కుడి చేతిపై నిద్రించడం వల్ల గుండె పైకి వస్తుంది. దీంతో గుండెపై భారం పడకుండా ఉంటుంది. ఇలా నిద్రించడం వల్ల మన ఆరోగ్యం చక్కగా ఉంటుందని వారు చెబుతున్నారు. అలాగే దక్షిణ దిక్కును యమ స్థానం అని, ఉత్తర దిక్కును కుభేర స్థానం అని చెబుతుంటారు. దక్షిణ దిక్కున తల పెట్టి నిద్రించడం వల్ల యమ ధర్మరాజు యొక్క కృప మన మీద ఉంటుందని దీంతో మనం చాలా కాలం చక్కగా పని చేసుకుంటూ ఉండగలమని పండితులు చెబుతున్నారు.
అలాగే దక్షిణ దిక్కున తల పెట్టి నిద్రించడం వల్ల మనం ఉదయం లేవగానే ఉత్తర దిక్కును చూస్తాము. ఉత్తర దిక్కును చూసి నమస్కరించుకోవడం వల్ల మనం కుభేరుడి యొక్క కృపను సొంతం చేసుకోగలుగుతామని దీంతో ఆర్థిక మస్యలు తలెత్తకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు. మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే దక్షిణ దిక్కున తల పెట్టి నిద్రించడం మంచిదని పండితులు చెబుతున్నారు.