lifestyle

Cold Water Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Cold Water Bath : సాధార‌ణంగా చాలా మంది రోజూ స్నానం అంటే వేన్నీళ్ల‌తో చేస్తుంటారు. కొంద‌రు వేస‌వి అయినా స‌రే వేన్నీళ్ల స్నానం చేసేందుకే ఇష్ట‌ప‌డుతారు. అయితే వాస్త‌వానికి మ‌నం బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌ను బ‌ట్టి నీళ్ల‌ను ఎంపిక చేసుకుని స్నానం చేయాలి. చ‌లికాలం అయితే వేన్నీళ్లు, వేస‌వి అయితే చ‌న్నీళ్ల‌ను మ‌నం స్నానానికి ఉప‌యోగించాలి. ఈ క్ర‌మంలోనే చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. చ‌ర్మం కాంతి పెరుగుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. రోజూ చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తుంటే శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంద‌ట‌. త‌ద్వారా అవి బాక్టీరియాలు, క్రిములు, ఇన్‌ఫెక్ష‌న్ల‌పై స‌మ‌ర్థ‌వంతంగా పోరాడ‌గ‌లుగుతాయ‌ట కూడా. ఇది మేం చెబుతోంది కాదు, ప‌లు అధ్య‌య‌నాలే చెబుతున్నాయి.

cold water bath is good for us know the reasons

చ‌న్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. దీంతో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా సాగుతాయి. ఇది థైరాయిడ్‌, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న‌వారికి మేలు చేసే అంశం. చ‌ర్మంలో ఉండే హానిక‌ర కెమిక‌ల్స్‌, ఇత‌ర వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. వేడి నీటితో స్నానం చేస్తే చ‌ర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అదే చ‌న్నీళ్లు అయితే చ‌ర్మ రంధ్రాలు మూసుకుంటాయి. క‌నుక ఇది మ‌న‌కు మేలు చేస్తుంది. ఎలా అంటే చ‌ర్మ రంధ్రాలు మూసుకుంటే అక్క‌డ మురికి చేర‌దు క‌దా. దీంతో చ‌ర్మం శుభ్రంగా ఉంటుంది. మొటిమ‌లు వంటివి రావు. చ‌న్నీటితో స్నానం చేస్తే వెంట్రుక‌లు న‌ల్ల‌గా అవుతాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. జుట్టు కూడా రాల‌కుండా దృఢంగా పెరుగుతుంది. చుండ్రు రాకుండా ఉంటుంది.

శ‌రీర ఎండోక్రిన్ వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. దీంతో హార్మోన్లు స‌రిగ్గా త‌యార‌వుతాయి. వివిధ శరీర క్రియ‌లు క్ర‌మ‌బ‌ద్దంగా సాగ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాలు కూడా రావు. పురుషులు వేడి నీటితో స్నానం చేస్తే వీర్య క‌ణాల సంఖ్య త‌గ్గుతుంది. ఎందుకంటే వృషణాల‌కు ఎల్ల‌ప్పుడూ త‌క్కువ ఉష్ణోగ్ర‌తే ఉండాలి. అది ఎక్కువైతే అందులో ఉండే వీర్యం ప‌ల్చ‌బ‌డుతుంది. ఎక్కువ‌గా ఉత్ప‌త్తి కాదు కూడా. దీంతో సంతానం కావాల‌నుకునే వారికి ఇబ్బందులు ఏర్ప‌డుతాయి. అదే చ‌న్నీళ్ల‌యితే అలాంటి ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. చ‌ల్ల‌ని నీటితో స్నానం చేస్తే శ‌రీరం రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. అందుకే పూర్వ కాలంలోనూ హైడ్రో థెర‌పీ పేరిట చ‌న్నీటిని ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేయ‌డానికి వాడేవారు. ఇప్ప‌టికీ ప‌లు స్పాల‌లో చ‌న్నీటితో స్నానం చేయిస్తారు. ఇలా చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల ప‌లు లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts