Bijli Shiva Temple : సైన్స్ కి కూడా అంతు చిక్కని రహస్యాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. బిజిలీ మహాదేవ ఆలయం కూడా అందులో ఒకటి. ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత చూస్తే షాక్ అవుతారు. చాలా మందికి ఇది తెలియక పోయి ఉండవచ్చు. కులు లోయలో సుమారు 2460 మీటర్లు ఎత్తులో కొన్ని యుగాలుగా బిజిలీ మహా దేవ్ ఆలయం ఉంది. కులుకి 22 కిలోమీటర్ల దూరం ఇది.
మూడు కిలోమీటర్ల పొడవైన దూరంలో ట్రక్ ద్వారా ఇక్కడికి వెళ్ళచ్చు. ఇక్కడ సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులని ఆకట్టుకుంటాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కులు వ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యటకులకి స్వర్గధామంగా వెలసింది. ఇక్కడ బిజిలీ మహా దేవ్ మందిర్ లో శివుడికి పూజలు చేస్తారు.
ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ ఆలయంపై పిడుగు పడి శివలింగం ముక్కలైపోయి తిరిగి మరుసటి రోజు అతుక్కుంటుంది. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇది కేవలం ఈ ఒక్క చోట మాత్రమే జరుగుతుంది. ప్రతి 12 ఏళ్లకు ఒక సారి ఇక్కడ ఇలా అద్భుతం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా ఎవరికీ తెలీదు. శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడడం, శివలింగం ముక్కలైపోవడం, మరుసటి రోజు మళ్ళీ అతుక్కోవడం. ఇదే తంతు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలైపోతుంది. తర్వాత ఆ ముక్కలన్నింటినీ ఆలయ పూజారి చేర్చి అభిషేకం చేస్తారు. మరుసటి రోజు శివలింగం యథావిధిగా ఉంటుంది. ఈ అరుదైన శివలింగాన్ని మీరు కులుకు వెళ్లి దర్శించుకోవచ్చు. బిజిలీ మహాదేవ్ ఆలయానికి ప్రైవేట్ క్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కులుకి వెళ్లి బస్సులో కూడా బిజిలీ ఆలయానికి వెళ్లొచ్చు.