information

ఈ వందే భారత్ ట్రైన్ దేశంలోనే ఎక్కువ దూరం వెళ్తుంది.. వివ‌రాలు ఇవే..!

ఈ సంవత్సరం దీపావళి పండుగకు భారతదేశంలోనే అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ అవ్వబోతోంది. ఇది 994 కిలోమీటర్ల ను కేవలం 11:30 గంటలలో మాత్రమే కవర్ చేస్తుంది. ఈ ట్రైన్ ఢిల్లీ నుండి పాట్నా మధ్య రన్ అవుతుంది. ఈ ట్రైన్ లో ముఖ్యంగా చైర్ కార్ సిటింగ్ ఉంటుంది. దీనిలో స్లీపర్ బెర్త్ కి బదులుగా చైర్ కార్ ఫెసిలిటీ ను పెట్టారు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లోనే ఇది రన్ అవుతుంది అని అధికారులు చెబుతున్నారు.

ఈ సీజన్ లో 8 ట్రిప్పుల కి ముందుగా ప్లాన్ చేశారు. అయితే ఈ సర్వీస్ అనేది అక్టోబర్ 30వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ ట్రిప్ ఢిల్లీ నుండి ప్రారంభం అవ్వగా, ఢిల్లీ వారణాసి సర్వీస్ రూట్ లో రన్ అవుతుంది. మొదటిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధానమంత్రి మోడీ 2019 లో ప్రారంభించారు.

this vande bharat train travels very far in the country

ఆ ట్రైన్ కూడా ఢిల్లీ వారణాసి రూట్ లోనే కొనసాగింది. ఈ ట్రైన్ కు సంబంధించి టికెట్ చార్జెస్ కూడా విడుదల చేశారు. చైర్ కార్ ధర 2,575 రూపాయలకి ఫిక్స్ చేశారు మరియు ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే 4,655 గా నిర్ణయించారు. అయితే దీనిలో మీల్స్ మరియు టీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు.

Peddinti Sravya

Recent Posts