viral news

వెయిట‌ర్ జాబ్ కోసం క్యూ క‌ట్టారు.. నిరుద్యోగం ఇంత‌లా ఉందా.. వీడియో వైర‌ల్‌..

చాలా మంది భారతీయులు మరో దేశానికి వెళ్లి స్థిరపడడం మనం చూస్తూ ఉంటాం. అయితే, కొంత మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ భారీగా సంపాదిస్తారు. వీళ్ళ గురించి పక్కనే పెట్టేస్తే కొంతమంది పక్క దేశానికి వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. పక్క దేశానికి వెళ్లి చిన్న ఉద్యోగాలతో సతమతమవుతున్న వారు కొందరైతే.. ఆ చిన్న ఉద్యోగం కోసం క్యూ కట్టే వారు మరి కొందరు.

తాజాగా అలా క్యూ కట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూస్తే చాలా షాకింగ్ గా ఉంది. ఎక్స్ పేజ్ మేఘ అప్డేట్స్ నుంచి ఒక వీడియో వైరల్ గా మారింది. 3000 మంది విద్యార్థులు కెనడాలో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ అయితే అక్కడికి వెళ్లారు. ఇంతకీ ఎందుకు వెళ్లారంటే ఉద్యోగాల కోసమే.

thousands of youth in queue for waiter job

లక్షల ఖర్చు పెట్టి కెనడా వచ్చిన విద్యార్థులు అక్కడ ఉద్యోగం కోసం ఇలా క్యూ కట్టారు. రెస్టారెంట్లో ఉద్యోగం దొరుకుతుందేమో అని అవకాశం కోసం వెళ్లారు. చాలామంది అక్కడకు వెళ్లి ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నారు. మరి భారతీయులు ఇలా రెస్టారెంట్ దగ్గర క్యూ కట్టిన వీడియో మీరు ఒక లుక్ వేసేయండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.

Peddinti Sravya

Recent Posts