Tomato Kurma : ట‌మాటాల‌తో కుర్మా.. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది..!

Tomato Kurma : మ‌నం వంటింట్లో అధికంగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. ట‌మాటాల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. ట‌మాటాల‌ను మ‌నం ర‌క‌ర‌కాల ఆహార‌ప‌దార్థాల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతూ ఉంటాం. ట‌మాటాల‌ను వివిధ కూర‌గాయ‌ల‌తో క‌లిపి వంట చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే ప‌ప్పు, ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటాయి. ట‌మాటాల‌తో మ‌నం కుర్మా వంటి కూర‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాట కుర్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట కుర్మాని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Tomato Kurma will be very tasty if you cook like this
Tomato Kurma

ట‌మాటా కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ట‌మాటాలు – అర‌కిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – కొద్దిగా, జీడి ప‌ప్పు – 5 లేదా6, ల‌వంగాలు – 3, యాలకులు – 3, దాల్చిన చెక్క – 2 (చిన్న‌వి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్‌, పెరుగు – అర క‌ప్పు, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్‌, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్‌, నూనె – రెండు టేబుల్ స్పూన్స్‌, కారం – ఒక టేబుల్ స్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, ప‌సుపు – పావు టీ స్పూన్‌, నీళ్లు – ఒక గ్లాసు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ట‌మాట కుర్మా త‌యారీ విధానం..

ముందుగా ట‌మాటాల‌ను పెద్ద ముక్క‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇప్పుడు ట‌మాటా ముక్క‌ల‌ను వేసి, క‌లిపి, మూత పెట్టి, మ‌ధ్య‌స్థ మంట‌పై ట‌మాటాల‌ను 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక జార్ లో ఎండు కొబ్బ‌రి, జీడి ప‌ప్పు, ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ట‌మాటాలు పూర్తిగా ఉడికిన త‌రువాత ముందుగా పేస్ట్ లా చేసి పెట్టుకున్న మిశ్ర‌మం, పెరుగు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, రుచికి స‌రిప‌డా ఉప్పు ను వేసి బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత ఒక గ్లాసు నీళ్ల‌ను పోసి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివర‌గా కొత్తిమీర‌ను వేసి, క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట కుర్మా త‌యార‌వుతుంది. ట‌మాట కుర్మాను అన్నం, చ‌పాతీ, పులావ్‌, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts