Tomato Ulligadda Karam : ట‌మాటా ఉల్లిగ‌డ్డ కారం ఇలా చేశారంటే.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Ulligadda Karam : వంట‌ల్లో వాడ‌డంతోపాటు మ‌నం ఉల్లిగ‌డ్డల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఉల్లిగ‌డ్డ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం కూడా ఒక‌టి. త‌ర‌చూ చేసే ఉల్లిగ‌డ్డ కారం కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసి చేసే ఉల్లిగ‌డ్డ‌కారం మ‌రింత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు చేసుకోద‌గిన చ‌క్క‌టి కూర‌ల‌ల్లో ఇది ఒక‌టి. దీనిని కేవ‌లం 15 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట ఉల్లిగ‌డ్డ కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ఉల్లిగడ్డ కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉల్లిపాయ‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), వెల్లుల్లి రెబ్బ‌లు – 7, కారం – 2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, ట‌మాటాలు – 4 లేదా 5 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Ulligadda Karam recipe in telugu make in this way
Tomato Ulligadda Karam

ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ఉల్లిగడ్డ ముక్కలు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. తాళింపు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత వాటిని గంటెతో గుజ్జులాగా చేసుకోవాలి.

త‌రువాత మ‌ర‌లా మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన ఉల్లిగ‌డ్డ కారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ట‌మాట ఉల్లిగ‌డ్డ కారాన్ని త‌యారు చేసుకుని తినవ‌చ్చు.

Share
D

Recent Posts