Tomato Vepudu Pappu : ట‌మాటాల‌ను వేసి ఎప్పుడైనా ఇలా వేపుడు ప‌ప్పును చేశారా.. రుచి అదిరిపోతుంది..

Tomato Vepudu Pappu : మనం వంటింట్లో విరివిరిగా ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ట‌మాట ప‌ప్పు ఒక‌టి. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ట‌మాట ప‌ప్పు, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట ప‌ప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే కింద చెప్పిన విధంగా చేసిన ట‌మాట ప‌ప్పు మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ ట‌మాట ప‌ప్పును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా ట‌మాట ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, త‌రిగిన ట‌మాటాలు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), తరిగిన ప‌చ్చిమిర్చి – 6 లేదా కారానికి త‌గిన‌న్ని, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Vepudu Pappu recipe in telugu very tasty try once
Tomato Vepudu Pappu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు ప‌దార్థాలు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, క‌చ్చా ప‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5.

ట‌మాట ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పు వేసి వేయించాలి. ఈ ప‌ప్పును మాడిపోకుండా చిన్న మంట‌పై చ‌క్క‌టి వాస‌న వ‌చ్చే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత ప‌ప్పులో నీటిని పోసి శుభ్రంగా క‌డిగి నీటిని వంపేయాలి. ఇప్పుడు కుక్క‌ర్ లో నీళ్లు, ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌సుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఉప్పు, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి. ఈ ప‌ప్పును మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించుకోవాలి.

తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ఉడికించుకున్న ప‌ప్పు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. ఈ ప‌ప్పును మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే ఈ విధంగా చేసిన ట‌మాట ప‌ప్పు మ‌రింత రుచిగా ఉంటుంది. లొట్ట లేసుకుంటూ ఈ ప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts