Ulligadda Tomato Karam : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేనప్పుడు సింపుల్‌గా ఇలా ఉల్లిగ‌డ్డ ట‌మాటా కారం చేయండి.. బాగుంటుంది..!

Ulligadda Tomato Karam : మ‌నం ఉల్లిగడ్డ‌ల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా ఉల్లిగడ్డ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల్లిగడ్డ ట‌మాట కారం కూడా ఒక‌టి. వేడి వేడి అన్నంతో తింటే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఉల్లిగడ్డ ట‌మాట కారాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ఉల్లిగడ్డ ట‌మాట కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిగ‌డ్డ ట‌మాట కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), వెల్లుల్లి రెబ్బ‌లు – 6, కారం -2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 లేదా 3టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీస్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 4 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Ulligadda Tomato Karam recipe in telugu make in this method
Ulligadda Tomato Karam

ఉల్లిగ‌డ్డ ట‌మాట కారం త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు, కారం వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గంటెతో ముక్క‌ల‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిగడ్డ ట‌మాట కారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ట‌మాట కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts