technology

ఐఫోన్ 16 ఫోన్ల‌ను రిట‌ర్న్ ఇచ్చేస్తున్న యూజ‌ర్లు..? ఎందుకు..?

తాజాగా విడుదలైన ఐఫోన్ 16 సిరీస్ ను చాలా మంది ఆఫర్స్ లో కొనుగోలు చేశారు. పైగా ఐఫోన్ వినియోగదారులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నారు. కాకపోతే ఐఫోన్ 16 సిరీస్ ను కొనుగోలు చేసిన వారు నెల రోజుల పూర్తి అవ్వకుండానే వాటిని రిటర్న్ చేస్తున్నారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో ఏ విధంగా ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ కోసం ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రిటర్న్ కు సంబంధించిన పోస్టులు ఎక్కువవుతున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ తర్వాత యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది లాంచ్ అవుతుంది అని తెలియజేశారు.

కాకపోతే ఎలాంటి ఫీచర్స్ లాంచ్ అవ్వకపోవడంతో ఐఫోన్ 16 ను రిటర్న్ చేస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబర్ ఐఫోన్ 16 కు సంబంధించి ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఐఫోన్ 16 లో ఆపిల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఈ ఫోన్ ను విడుదల చేశారని పైగా ఐఫోన్ 15 కు ఐఫోన్ 16 కు పెద్ద తేడా లేదని కేవలం కొన్ని అప్ గ్రేడ్స్ మాత్రమే చేశారని తెలియజేశారు.

users are returning iphone 16 phones why

దాంతో ఐఫోన్ 16 ప్రో ను తెచ్చుకొని రిటర్న్ కూడా చేసేసాను అని వ్యక్తం చేశారు. పైగా ఐఫోన్ 15 ప్రో మాక్స్ ను ఉపయోగించడమే మేలు అని తెలిపారు. ఐఫోన్ 16 లో వైఫై కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయని, పర్ఫామెన్స్ కూడా తగ్గిపోయింది అని చెప్పడం జరిగింది. ఐఫోన్ 16 సిరీస్ లో కంట్రోల్ బటన్ తో చాలా సమస్య వచ్చిందని దాన్ని టచ్ చేయడం వల్ల కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చేస్తే బ్యాటరీ డ్రైన్ అవ్వడం ,అనవసరమైన ఫోటోలు తో గ్యాలరీ నిండిపోవడం వంటివి జరుగుతాయి.

Peddinti Sravya

Recent Posts