jobs education

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో 344 ఖాళీలు..!

ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ కొత్త నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 344 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పింది.

మంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళితే మొత్తం.. 344 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం రెండు సంవత్సరాలు గ్రామీణ డాక్ సేవక్ లో పని చేసిన అనుభవం ఉండాలి.

vacancy in postal department

సెప్టెంబర్ 1, 2024 కి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అర్హులు. జీతం వచ్చేసే నెలకి రూ.30,000 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 750. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2024 ఆఖరి తేదీ.

Peddinti Sravya

Recent Posts