Cumin Ajwain And Black Salt : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకునే ఆహారంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అయితే మన ఇంట్లో కొన్ని పదార్థాలు మన ఆరోగ్యానికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
జీలకర్ర, వాము, నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జీలకర్ర, నల్ల ఉప్పు, వాముతో చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జీలకర్రని తీసుకుంటే పలు రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జీలకర్రని తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు. జీలకర్ర తీసుకోవడం వలన గ్యాస్ వంటి బాధలు ఉండవు. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ జీలకర్రలో ఉంటాయి. కడుపునొప్పి వంటి బాధలు జీలకర్రతో తొలగిపోతాయి. జీలకర్రను తీసుకుంటే దంత సమస్యలు కూడా వుండవు. ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి వాము కూడా ఎంతో మేలు చేస్తుంది.
పంటి సమస్యల నుండి జీలకర్ర, వాము, నల్ల ఉప్పు కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. జీలకర్ర, వాము, నల్ల ఉప్పు రక్తపోటుని కూడా తగ్గించగలవు. రక్తపోటును తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో కూడా ఉంచగలవు. యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి. జీలకర్ర, వాము, నల్ల ఉప్పు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఇతర పోషకాలు కూడా వీటితో పొందవచ్చు. వ్యాధులతో పోరాడడానికి, ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని దూరంగా ఉంచడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. జీలకర్ర, వాము, నల్ల ఉప్పు కొవ్వుని కూడా తగ్గించగలవు. జీవక్రియలని కూడా పెంచగలవు. జీర్ణవ్యవస్థ పనితీరుని నియంత్రిస్తాయి. నల్ల ఉప్పు తీసుకుంటే ఉబకాయం కూడా తగ్గుతుంది. ఇలా మనం ఈ మూడింటితో ఈ బాధల నుండి బయట పడవచ్చు.