Vankaya Tomato Pachadi : వంట రాక‌పోయినా స‌రే ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చేయ‌వ‌చ్చు.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే వ‌హ్వా అంటారు..

Vankaya Tomato Pachadi : మ‌నం వంటింట్లో ఊర‌గాయ‌లే కాకుండా ర‌క‌ర‌కాల పచ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అప్ప‌టిక‌ప్ప‌డు త‌యారు చేసే ఈ ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేయ‌డానికి ట‌మాటాల‌తో పాటు వివిధ కూర‌గాయ‌ల‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇలా మ‌నం చాలా త‌క్కువ స‌మ‌యంలో అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకోగ‌ల ప‌చ్చ‌ళ్ల‌ల్లో వంకాయ ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వంకాయ‌ల‌ను, ట‌మాటాల‌ను ఉప‌యోగించి చేసే ఈ ప‌చ్చ‌డి చాలారుచిగా ఉంటుంది. వంట‌రాని వారు బ్యాచిలర్స్ కూడా ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో రుచిగా ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన వంకాయ‌లు – అర కిలో, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 4, చింత‌పండు – – స‌గం నిమ్మ‌కాయంత ప‌రిమాణం, నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌చ్చిమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Vankaya Tomato Pachadi recipe in telugu best dish
Vankaya Tomato Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

వంకాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ధ‌నియాలు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో వంకాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత వీటిని మ‌రో ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ట‌మాట ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు, చింత‌పండు వేసి వేయించాలి. ట‌మా ట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ వేయించి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించిన ప‌ల్లీలు వేసి పొడిగా చేసుకోవాలి. త‌రువాత వేయించిన ప‌చ్చిమిర్చి, వంకాయ ముక్క‌లు వేసి కచ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ఉడికించిన ట‌మాట‌, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు, కొత్తిమీర వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా త‌యారు చేసుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో త‌ర‌చూ కూర‌ల‌నే కాకుండా ఇలా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వంకాయ ట‌మాట ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts