Vastu Items : రంగు రంగు రాళ్లు, చిన్న చిన్న గడ్డి మొక్కలు, నీరు, చిన్నపాటి డెకెరేటివ్ ఐటమ్స్, వాటిలో రంగు రంగు చేపలు… ఇవి కలిసి ఉండేది అనగానే అందరూ చెప్పేది అక్వేరియం. చాలా మంది ఇండ్లల్లో ఈ అక్వేరియాలు ఉంటాయి. వాటిలో రంగు రాళ్లను, చేపలను వేసి పెంచుకుంటారు. ఇంకా కొందరు వాటిని ఇంకా అందంగా తీర్చిదిద్దుతారు. కానీ నిజానికైతే ఇంట్లో కానీ, ఆఫీస్ లో కానీ అక్వేరియాలు ఉండకూడదట. అక్వేరియాలను ఇంట్లో ఉంచుకుంటే చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక్క అక్వేరియమే కాదు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంట్లో ఉంచకూడని వస్తువుల గురించి అలాగే వాటిని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియం ఉండకూడదు.
తొట్టిలో, గ్లాస్ పెట్టెలో నీళ్లు పోసి చేపలను పెంచడం వల్ల ఆ ఇంటి యజమానికి అన్నీ కష్టాలే కలుగుతాయట. మానసిక ఆనందం కూడా దూరమవతుందట. అప్పులు పెరిగిపోతాయట. అందుకని అక్వేరియాన్ని ఇంట్లో ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇక ఇంట్లో పని చేయని గడియారాలు కూడా ఉండకూడదు. అలాగే ఇంట్లో మహా భారత యుద్ద సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్ లు అస్సలు పెట్టకూడదు. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోని వారికి అన్నీ కష్టాలే ఎదువరవుతాయట. చాలా మంది ఇండ్లలో మనీ ప్లాంట్స్ పు పెంచుకుంటారు. దాని వల్ల అదృష్టం, ధనం కలిసి వస్తుందని భావిస్తారు.
నిజానికి మనీ ప్లాంట్ లను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. వాటి వల్ల అంతా నెగెటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. దీంతో ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చి చేరి అందరికి ఇబ్బందులు కలిగిస్తాయట. అయితే మనీ ప్లాంట్‌ను ఇంటి బయట పెంచుకోవచ్చు. అలాగే ఇంట్లో కప్పలు ఉండకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో ఉండే వారికి కష్టాలు తప్పవట. ఇక తలకు పైన వేలాయుధంతో కూడిన కుమారస్వామి బొమ్మ అస్సలు ఉండకూడదట. అలాగే ఇంట్లో అడుగు కంటే ఎక్కువ ఎత్తులో ఉండే దేవతా విగ్రహాలను ఉంచుకోకూడదట. వాస్తు ప్రకారం ఎక్కువ ఎత్తులో ఉండే విగ్రహాలను ఉంచుకోవడం మంచిది కాదు. వాస్తు ప్రకారం వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా అవి చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలట.
అదేవిధంగా వ్యాపార ప్రాంతానికి తూర్పు, దక్షిణ దిక్కులో ఎక్కువ విశాలంగా ఉండేలా చూసుకోవాలట. దీని వల్ల వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుందట. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేసే వారు తూర్పు దిశలో నిలబడి పూజ చేయాలి. దీంతో అంతా శుభమే జరుగుతుందట. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయట. ఇంటికి ఎదురుగా వైద్య శాలలు, మాంసం దుకాణాలు, ఇనుము, ఇనుప వస్తువులు తయారు చేసే షాపులు ఉండకూడదని వాస్తు చెబుతుంది. అలా ఉంటే ఆయా ఇండ్లల్లో నివసించే వారికి అన్నీ కష్టాలే ఎదురవుతాయట.