Vastu Tips : మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆర్థిక వనరులను అలాగే మన సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇల్లు కట్టుకుంటాము. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ముఖ్యంగా వాస్తు గురించి ఆలోచిస్తూ ఉంటాము. వాస్తు శాస్త్రంలో ఉండే నియమాలను బట్టి మనకు అనుగుణంగా ఇల్లు కట్టుకుంటాము. వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు ఉంటాయి. వాటిలో రావి చెట్టు ఉన్న దగ్గర ఇల్లు కట్టకూడదనేది కూడా ఒకటి. రావి చెట్టుకు ఆద్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి దేవాలయంలో కూడా రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టుకు కూడా భక్తి శ్రద్దలతో పూజలు చేస్తూ ఉంటారు.
కానీ రావి చెట్టు ఉన్న దగ్గర ఇల్లు కట్టుకుంటే మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్త్రు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాల్లో ఈ చెట్టును ఎట్టి పరిస్థితులల్లో పెంచకూడదని వారు చెబుతున్నారు. రావి చెట్టు ఉన్న దగ్గర ఇల్లు కట్టుకుంటే మనం ఆర్థిక సమస్యలను అలాగే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. అలాగే అనేక కష్టాల బారిన పడాల్సి వస్తుందని మనం చేసే ప్రతిపనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. రావి చెట్టు ఉన్న చోట నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని దీని కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయని వారు తెలియజేస్తున్నారు.
అలాగే రావి చెట్టు చాలాపెద్దగా పెరుగుతుంది. దీని వేర్లు భూమిలో చాలా లోతుకు, చాలా బలంగా వెళ్లాయి. అలాగే ఈ చెట్టుకు నీరు కూడా ఎక్కువగా అవసరమవుతుంది.ఇంటి పక్కన ఈ చెట్టు ఉంటే ఇంటి గోడలకు బీటలు వచ్చే అవకాశం ఉంది. రావి చెట్టు నుండి వచ్చే నెగెటివ్ ఎనర్జీ కారణంగా కుటుంబంలో కలహాలు, అశాంతి నెలకొంటుందని కనుక ఇల్లు కట్టేటప్పుడు, భూమి కొనేటప్పుడు ఆ స్థలంలో అలాగే ఇంటి చుట్టు పక్కల రావి చెట్టు లేకుండా చూసుకోవాలని వాస్త్రు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.