Gummadikaya Bobbatlu : గుమ్మ‌డికాయ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బొబ్బ‌ట్లు.. త‌యారీ ఇలా..!

Gummadikaya Bobbatlu : మ‌నం వంటింట్లో త‌యారు చేసే తీపి వంట‌కాల్లో బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. బొబ్బ‌ట్లు చాలా మెత్త‌గా, రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బట్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం చాలా సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ బొబ్బ‌ట్ల‌ల్లో గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు కూడా ఒక‌టి. గుమ్మ‌డికాయ‌తో చేసే ఈ బొబ్బ‌ట్లు చాలా రుచిగా, మెత్త‌గా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్ల‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి -ఒక క‌ప్పు, ఉప్పు – చిటికెడు, వేడి నెయ్యి – 2 టీ స్పూన్స్, గుమ్మ‌డికాయ తురుము – 2 క‌ప్పులు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

Gummadikaya Bobbatlu recipe in telugu make in this method
Gummadikaya Bobbatlu

గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత పిండిపై మూత పెట్టి అర గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత గుమ్మ‌డికాయ తురుము వేసి వేయించాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత బెల్లం తురుము వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిని క‌ళాయికి అంటుకోకుండా వేర‌య్యే వ‌ర‌కు బాగా ఉడికించాలి. గుమ్మ‌డికాయ తురుము మెత్త‌గా ఉడికి పూర్తిగా ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ముందుగా క‌లిపిన పిండిని మ‌రోసారి బాగా క‌లుపుకోవాలి.

త‌రువాత నిమ్మ‌కాయంత పిండిని తీసుకుని ముందుగా పూరీలాగా వ‌త్తుకోవాలి. త‌రువాత ఇందులో గుమ్మ‌డికాయ తురుముతో చేసిన ఉండ‌ను ఉంచి అంచులను మూసివేయాలి. త‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ ప‌రోటాలా వ‌త్తుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న బొబ్బ‌ట్ల‌ను వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. దీనిని ముందుగా రెండు వైపులా వ‌త్తుకున్న త‌రువాత నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్లు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా త‌యారు చేసిన గుమ్మ‌డికాయ బొబ్బ‌ట్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts