Veg Biryani In Pressure Cooker : ఇలా చేస్తే.. ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వెజ్ బిర్యానీని చాలా ఈజీగా వండేయొచ్చు..!

Veg Biryani In Pressure Cooker : మ‌నం చికెన్, మ‌ట‌న్ ల‌తోనే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా వెజ్ బిర్యానీని త‌యారు చేస్తూ ఉంటాం. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టప‌డే వారు కూడా చాలా మందే ఉంటారు. ఈ వెజ్ బిర్యానీని చాలా సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని కుక్క‌ర్ లో వేసి చాలా త‌క్కువ స‌మ‌యంలో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కుక్క‌ర్ లో రుచిగా వెజ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్క‌ర్ లో వెజ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – 2 గ్లాసులు, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన క్యారెట్ – 1, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – పావు క‌ప్పు, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా పొడి – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.

Veg Biryani In Pressure Cooker recipe in telugu very easy to cook
Veg Biryani In Pressure Cooker

మ‌సాలా దినుసులు..

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకులు – 2, అనాస పువ్వు – 1, జాప‌త్రి – 1, మ‌రాఠి మొగ్గ – 1.

కుక్క‌ర్ లో వెజ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, క్యారెట్ ముక్క‌లు, ప‌చ్చిబ‌ఠాణీ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత పెరుగు, ఉప్పు,కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా పొడి, ప‌సుపు వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తీ బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. త‌రువాత 3 గ్లాసుల నీటిని పోసి క‌ల‌పాలి.

త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి మ‌ధ్యస్థ మంట‌పై 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి వెజ్ బిర్యానీని ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బిర్యానీ త‌యార‌వుతుంది. వంట చేయ‌డానికి ఎక్కువగా స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా కుక్క‌ర్ లో వెజ్ బిర్యానీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ వెజ్ బిర్యానీలో క్యాలీప్ల‌వ‌ర్, బీన్స్ వంటి ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు. దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వెజ్ బిర్యానీని అంద‌రూ ఒక ముద్ద కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts