High BP : ప్రస్తుత తరుణంలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, వంశ పారంపర్యత, డయాబెటిస్, కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి హైబీపీ సమస్య వస్తోంది. అయితే ఇవే కాకుండా హైబీపీ వచ్చేందుకు ఇంకా 3 ముఖ్యమై కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే..
1. ఉప్పును అధికంగా తీసుకున్నా శరీరంలో బీపీ పెరుగుతుంది. సోడియం కలిగిన ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటుపెరుగుతుంది. తగిన మోతాదులో ఉప్పును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. కానీ అధిక మోతాదులో ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటుపెరుగుతుంది. బీపీ సమస్యతో బాధపడే వారు రోజూకి ఒక్క టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పును తీసుకోరాదు. ఉప్పును తగ్గించి తీసుకుంటే బీపీ రాకుండా చూసుకోవచ్చు.
2. బీపీ నియంత్రణలో ఉండాలంటే అధికంగా కొవ్వు ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫుల్ ప్యాట్ ఐస్‌క్రీమ్, బటర్, మాంసం వంటి కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల బీపీ పెరగడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కనుక వీటిని తక్కువగా తీసుకోవాలి.
3. మద్యం సేవించడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు మద్యానికి దూరంగా ఉండాలి. తక్కువ మద్యం సేవించడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. భవిష్యత్తులో అధిక రక్తపోటు సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే మద్యానికి దూరంగా ఉండాలి. దీంతో బీపీ రాకుండా చూసుకోవచ్చు.