Viral Video : ఈ వీడియోను మీరు చూస్తే ఇక‌పై ప్యాక్ చేయ‌బ‌డిన మ్యాంగో జ్యూస్ అస‌లు తాగ‌రు..!

Viral Video : బ‌య‌టకు వెళ్లిన‌ప్పుడు దాహంగా ఉంటే లేదా శ‌క్తి కోసం మ‌న‌లో చాలా మంది పండ్ల ర‌సాల‌ను తాగుతుంటారు. బండ్ల మీద అమ్మే పండ్ల ర‌సాల‌ను కొంద‌రు తాగుతారు. ఇక కొంద‌రు ప్యాక్ చేయ‌బ‌డిన పండ్ల ర‌సాల‌ను సేవిస్తుంటారు. ఇవి మ‌న‌కు టెట్రా ప్యాక్ లేదా ప్లాస్టిక్ బాటిల్స్‌లో ల‌భిస్తున్నాయి. అయితే ఇలా ప్యాక్ చేయ‌బ‌డిన పండ్ల రసాల‌ను గ‌న‌క మీరు తాగుతుంటే జాగ్ర‌త్త‌. ముఖ్యంగా మ్యాంగో జ్యూస్ తాగేవారు అల‌ర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక షాకింగ్ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

మ్యాంగో జ్యూస్ త‌యారు చేస్తున్న విధానాన్ని ఒక వ్య‌క్తి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే అందులో అన్నీ కెమిక‌ల్సే క‌లుపుతుండ‌డం గ‌మ‌నార్హం. మామిడి పండ్ల గుజ్జు క‌లిపిన‌ట్లు ఎక్క‌డా వీడియో లేదు. దీంతో ఈ వీడియోకు నెటిజ‌న్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. కెమిక‌ల్స్ స‌రే, మామిడి పండ్ల గుజ్జు ఏది.. అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వీడియో చూసిన త‌రువాత నాకు అస‌లు జ్యూస్ తాగాల‌ని అనిపించ‌డం లేదు. అది కేవ‌లం నీరు మాత్ర‌మే.. అని ఒక యూజ‌ర్ కామెంట్ చేశాడు.

Viral Video mango juice making netizen comments
Viral Video

నెటిజ‌న్ల కామెంట్లు..

ఈ జ్యూస్ స్లో పాయిజ‌న్ లాంటిద‌ని మ‌రొక యూజ‌ర్ కామెంట్ పెట్టాడు. ఇలా నెటిజ‌న్లు ఈ వీడియోను చూసి షాకింగ్ కామెంట్ల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఈ పండ్ల ర‌సాన్ని ఎక్క‌డ త‌యారు చేశారు.. ఏ కంపెనీ.. అన్న వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు కానీ ఇక‌పై మ్యాంగో జ్యూస్ మాత్ర‌మే కాదు, ప్యాక్ చేయ‌బ‌డిన ఏ జ్యూస్ తాగాల‌న్నా కూడా భ‌య‌మేస్తుంద‌ని చాలా మంది నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే పండ్ల ర‌సాల‌ను తాగాల‌నుకునేవారు ఇంట్లోనే తాజాగా త‌యారు చేసి తాగ‌డం మంచిద‌ని వైద్యులు సూచిస్తున్నారు. టెట్రా ప్యాక్‌లు లేదా ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఇచ్చే జ్యూస్‌ల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని, అలాగే రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై చేసే పండ్ల ర‌సాలు అప‌రిశుభ్రంగా ఉంటాయని, క‌నుక ఇంట్లోనే పండ్ల ర‌సాల‌ను చేసుకుని తాగ‌డం మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ ఉన్న‌వారు ఈ పండ్ల ర‌సాల‌ను తాగే విష‌యంలో ఎందుకైనా మంచిది జాగ్ర‌త్త వ‌హించండి. లేదంటే అవ‌న‌స‌రంగా రోగాల‌ను కొని తెచ్చుకున్న‌వారు అవుతారు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండండి.

Share
Editor

Recent Posts