Vitamin B3 : మీ శ‌రీరంలో ఈ విట‌మిన్ లోపం ఉందా.. అయితే హార్ట్ ఎటాక్ వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Vitamin B3 : మ‌న శరీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అని కూడా అంటారు. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. మ‌నం పాటించే జీవ‌న‌విధానం, తినే ఆహారం వ‌ల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు మ‌న శ‌రీరంలో పెరిగిపోతాయి. అలాగే ఒత్తిడి అధికంగా ఉండ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, రోజూ గంట‌ల త‌ర‌బ‌డి ఒకే చోట కూర్చుని ప‌నిచ‌య‌డం, ధూమ పానం, మ‌ద్య‌పానం వంటి కార‌ణాల వల్ల కూడా మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇవి పెరిగితే ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి బీపీ పెరుగుతుంది. ఫ‌లితంగా అది హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ కు కార‌ణం అవుతుంది.

క‌నుక మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌యార‌య్యే ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే కేవ‌లం పైన చెప్పిన కార‌ణాలు మాత్ర‌మే కాకుండా మ‌న శ‌రీరంలో విట‌మిన్ బి లోపం ఏర్ప‌డ‌డం వ‌ల్ల కూడా ఎల్‌డీఎల్ స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే విట‌మిన్ బి3 లివ‌ర్‌లో హెచ్‌డీఎల్ ఉత్ప‌త్తిని పెంచుతుంది. దీంతో హెచ్‌డీఎల్‌.. ఎల్‌డీఎల్‌ను త‌గ్గిస్తుంది. ఫ‌లితంగా ఆరోగ్యంగా ఉంటారు. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అయితే విట‌మిన్ బి3 లోపం గ‌న‌క ఏర్ప‌డితే అప్పుడు త‌గినంతగా హెచ్‌డీఎల్ త‌యార‌వ‌దు. ఫ‌లితంగా శ‌రీరంలో ఎల్‌డీఎల్ అలాగే పేరుకుపోతుంది. దీంతో అది ర‌క్త‌నాళాల్లో అడ్డు ప‌డి మ‌న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Vitamin B3 deficiency can cause heart attack know what happens
Vitamin B3

ప‌రోక్షంగా హార్ట్ ఎటాక్‌కు కార‌ణం అవుతుంది..

క‌నుక విట‌మిన్ బి3 లోపం అనేది ప‌రోక్షంగా హార్ట్ ఎటాక్‌కు కారణం అవుతుంది. అందువ‌ల్ల ఈ లోపం రాకుండా చూసుకోవాలి. అయితే ఈ లోపం వ‌చ్చిన‌ట్లు ఎలా తెలుస్తుంది అంటే.. మీరు ఎన్ని జాగ్ర‌త్త‌లు పాటించినా, ఎంత డైట్ చేసినా, ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలిని పాటించినా.. మీ శ‌రీరంలో ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంది అంటే మీ శ‌రీరంలో విట‌మిన్ బి3 లేన‌ట్లే. ఇదే ల‌క్ష‌ణాన్ని గుర్తించాలి. మీ శ‌రీరంలో గ‌న‌క ఇలా జ‌రిగితే విట‌మిన్ బి3 లోపం ఉన్న‌ట్లు గ్ర‌హించాలి. అప్పుడు విట‌మిన్ బి3 లోపాన్ని స‌రిచేయ‌డం ద్వారా ఎల్‌డీఎల్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను మ‌నం విట‌మిన్ బి3 ఉండే ఆహారాల‌ను రోజూ తినాల్సి ఉంటుంది.

ఇక విట‌మిన్ బి3 మ‌న‌కు ప‌లు ఆహారాల వ‌ల్ల ల‌భిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విట‌మిన్ బి3 మ‌న‌కు చేప‌లు, మ‌ట‌న్‌, చికెన్‌, అవ‌కాడో, ఆకుకూర‌లు, అర‌టి పండ్లు, యాపిల్స్‌, నారింజ‌, మిల్లెట్స్‌, కోడిగుడ్లు, బాదంప‌ప్పు వంటి వాటిల్లో స‌మృద్ధిగా ల‌భిస్తుంది. క‌నుక ఈ ఆహారాల‌ను త‌ర‌చూ తింటుంటే విట‌మిన్ బి3 లోపాన్ని అరిక‌ట్ట‌వ‌చ్చు. ఫ‌లితంగా మ‌న శ‌రీరంలో హెచ్‌డీఎల్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇది ఎల్‌డీఎల్‌ను త‌గ్గిస్తుంది. దీంతో ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. క‌నుక విట‌మిన్ బి3 ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. ఇక దీన్నే నియాసిన్ అని కూడా అంటారు. క‌నుక ఇది ఉన్న ఆహారాల‌ను త‌ర‌చూ తిన‌డం మ‌రిచిపోకండి. దీంతో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts