Laptop : ల్యాప్‌టాప్ కొనాలని అనుకుంటున్నారా ? అయితే ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మీకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. పలు కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. అమెజాన్ తన సైట్‌లో గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ మంగళవారం ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక రకాల ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. అలాగే గేమింగ్ కోసం ఉపయోగపడే వస్తువులపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో లెనోవో, ఏసర్, అసుస్, ఎల్‌జీ, హెచ్‌పీ, సోనీ, డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్ వంటి బ్రాండ్‌లకు చెందిన గేమింగ్ ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్‌లు, మానిటర్లు, హెడ్ సెట్ లు, గేమింగ్ కన్సోల్స్, గ్రాఫిక్ కార్డులపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా అనేక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.
ఇక సేల్‌లో ఏసర్ నైట్రో 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.62వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో కోర్ ఐ5 11వ జనరేషన్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ, గ్రాఫిక్ కార్డ్ ఉన్నాయి. ఇక హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ ధర రూ.83,990గా ఉంది. అలాగే ఎన్నో ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు.