ఆధ్యాత్మికం

Ragi Chembu : పూజ గ‌దిలో రాగి చెంబు క‌చ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

Ragi Chembu : ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు సుఖ సంతోషాల‌తో జీవించాలంటే వాస్తు ప్ర‌కారం ఇంటిని నిర్మించుకోవ‌డ‌మే కాకుండా ప్ర‌తిరోజు చ‌క్క‌గా పూజ చేయాలి. పూజ చేసేట‌ప్పుడు మీ గ‌దిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి. దీని వ‌ల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయ‌ని పండితులు చెబుతున్నారు. ఇంట్లో సానుకూల‌త పెరిగి ప్ర‌తికూల శ‌క్తుల‌న్నీ తొల‌గిపోతాయి. రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి. అప్పుడే మీరు చేసే పూజ‌కు పుణ్య‌ఫ‌లితం ల‌భిస్తుంది. మ‌నం పూజ చేసేట‌ప్పుడు పూజ‌లో ఉండే శ‌క్తి రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్త‌మై ఉంటుంది. అందుకే పూజ అనంత‌రం ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా తీసుకోవాలి. రోజూ పూజ చేయ‌డం కుద‌ర‌ని వారు రాగి చెంబులో నీటిని నింపి ప్ర‌తిరోజూ ఆ నీటిని మారుస్తూ దేవుని గ‌దిలో పెట్టి న‌మ‌స్కారం చేస్తే చాలు. రోజూ పూజ చేసినంత పుణ్య‌ఫ‌లితం ల‌భిస్తుంది.

పూజ గ‌దిలో రాగి చెంబు పెట్టాల‌నుకునే వారు చెంబుకు ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగిచెంబు నిండా పోసి అందులో ఒక పువ్వు వేసి దేవుని గ‌దిలో ఉంచి పూజ చేయాలి. పూజ పూర్త‌యిన త‌రువాత ఆ రాగి చెంబు ముట్టుకుని మ‌న‌సులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక ఖ‌చ్చితంగా నెర‌వేరుతుంది. అలాగే శుక్ర‌వారం పూజ చేసేవారు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్లలు వేసి పూజ గ‌దిలో పెట్టి పూజ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హంతో మీ ఇంట్లో సిరిసంప‌ద‌లు వెల్లివిరుస్తాయి. పూజ పూర్త‌యిన త‌రువాత రాగి చెంబులో వేసిన రూపాయి బిళ్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా దాచి పెట్టాలి. అలాగే ఇళ్లు క‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశ‌లో నీటి కుండలు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీరు అనుకున్న క‌ల నెర‌వేరుతుంది. ఇక పూజ గ‌దిలో రాగి చెంబు ఉంచ‌డానికి మ‌రొక కార‌ణం కూడా ఉంది.

we should keep ragi chembu in pooja gadi know why

రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవ‌త‌ల‌కు ప్రీతిపాత్ర‌మైన అవాస స్థ‌లం. అందుకే రాగి పాత్ర‌లో నీటిని ఉంచ‌డం వ‌ల్ల ఆ నీటిలో దేవ‌త‌లు నివ‌సిస్తార‌ని న‌మ్ముతారు. కాబ‌ట్టి పూజ‌గ‌దిలో రాగి చెంబులో నీటిని ఉంచ‌డం చాలా మంచిది. అలాగే పూజ గ‌దిని సంప్రోక్ష‌ణ చేయ‌డానికి ఈ నీటిని వాడ‌వ‌చ్చు. ఈ నీటిని సంప్రోక్ష‌ణ చేయ‌డానికి వాడ‌డం వ‌ల్ల దేవ‌త‌లు సంతోషిస్తార‌ట‌. అలాగే పూజ చేసేట‌ప్పుడు రాగిచెంబులో ఉన్న పాత నీటిని ఇంటి ముందు ఉన్న తుల‌సి కోట‌లో పోసి రాగిచెంబును శుభ్రంగా క‌డిగి అందులో కొత్త నీళ్లు నింపి పూజ గ‌దిలో పెట్టాలి. రాగి చెంబులో నిండుగా నీటిని నింపి దాంట్లో ప‌సుపు కుంకుమ వేసి ఇంటి బ‌య‌ట గ‌డ‌ప ప‌క్క‌న పెడితే మీ ఇంట్లోకి దేవ‌త‌లు ప్ర‌వేశిస్తార‌ట‌.

Admin

Recent Posts