ఆధ్యాత్మికం

Godanam : గోదానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి గొప్ప ఫ‌లితం ఉంటుందో తెలుసా..?

Godanam : పూజ‌లు లేదా ఇత‌ర కార్యాల స‌మ‌యంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే దానాలు చేస్తుంటారు. కొంద‌రు బ్రాహ్మ‌ణుల‌కు దానం చేస్తారు. ఇలా చేస్తే గ్ర‌హ దోషాలు తొల‌గిపోతాయి. ఇక ఇవే కాకుండా ప‌లు దానాలు కూడా ఇత‌రుల‌కు చేయ‌వ‌చ్చు. పూజ‌లు, పుణ్య కార్యాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా ఈ దానాలు చేస్తుంటారు. దీంతో భిన్న ర‌కాల ఫ‌లితాలు క‌లుగుతాయి. అయితే ఆయా దానాల్లో గోదానం కూడా ఒక‌టి. గోదానం చేయ‌డం వ‌ల్ల ఎంతో గొప్ప ఫ‌లితం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. ఇక గోదానం వెనుక ఉన్న ఓ క‌థ‌ను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం ఔద్దాలకి అనే మహర్షి ఉండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో ఉన్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశిస్తాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించవు. అప్ప‌టికే న‌ది పొంగుతుంది. దీంతో అవి కొట్టుకుపోతాయి. ఆ త‌రువాత వ‌చ్చిన నాచికేతుడికి అవి క‌నిపంచ‌వు. దీంతో జ‌రిగిన విష‌యాన్ని అత‌ను తండ్రి దగ్గరకు వెళ్లి చెబుతాడు. అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి త‌న యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో ఉంటాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడిస్తాడు. దీంతో మ‌హ‌ర్షికి పట్టరాని కోపం వ‌స్తుంది. నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శపిస్తాడు.

what are the benefits of godanam

తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కుప్ప కూలిపోతాడు. వెంటనే అతను న‌ర‌కానికి వెళ్తాడు. అయితే తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదిస్తాడు. కానీ మ‌రుస‌టి రోజు సూర్యోదయ సమయానికి నాచికేతుడు లేచి తిరిగి వ‌స్తాడు. దీంతో ఔద్దాల‌కి ప‌ట్ట‌రాని సంతోషంతో త‌న కుమారున్ని కౌగిలించుకుంటాడు. అప్పుడు నాచికేతుడు జ‌రిగిన విష‌యాల‌ను వెల్లడిస్తాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపొమ్మని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతుడిని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెబుతాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేస్తాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును నాచికేతుడు కోరగా అతిథుల కోరిక‌ నెరవేర్చడం తమ బాధ్య‌త‌ అని యముడు భావించి అప్పుడు నాచికేతుడికి పుణ్య‌లోకాల‌ను చూపిస్తాడు. అక్క‌డ దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు ఉంటారు. వారిని నాచికేతుడు చూస్తాడు.

అయితే పుణ్య‌లోకాల‌కు వెళ్లాలంటే ఏం చేయాలో చెప్పాలని నాచికేతుడు య‌మున్ని అడుగుతాడు. ఇందుకు య‌ముడు బ‌దులిస్తూ.. శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యలోకాల‌కు చేరుకుంటార‌ని చెబుతాడు. అయితే ఇందుకు గాను ముందుగా మూడు రాత్రులు నేల మీద నిద్రించాలి. కేవ‌లం నీటిని మాత్ర‌మే తీసుకుంటూ దీక్ష చేయాలి. ఆ త‌రువాత గోదానం చేయాలి. దీంతో పుణ్య‌లోకాలు ప్రాప్తిస్తాయి. ఇక చిన్న వ‌య‌స్సులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేయాలి. దీంతో ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల పాటు పుణ్యలోకాల్లో ఉంటారు. ఇలా గోదానం చేయ‌డం వ‌ల్ల క‌లిగే ఫ‌లితాన్ని యముడు నాచికేతుడికి వివ‌రిస్తాడు. ఇదే విష‌యాన్ని నాచికేతుడు త‌న తండ్రికి తెలియ‌జేస్తాడు. అయితే ఈ క‌థ‌ను భీష్ముడు ఒక స‌మ‌యంలో ధ‌ర్మ‌రాజుకి చెబుతాడు. ఇది మ‌హాభారతంలో ఉంటుంది. ఇలా గోదానం చేయ‌డం వ‌ల్ల ఎంతో గొప్ప ఫ‌లితం ఉంటుంద‌ని పండితులు తెలియ‌జేస్తున్నారు.

Admin

Recent Posts