ఆధ్యాత్మికం

ఎండిపోయిన పువ్వులను దేవుడి దగ్గర ఉంచుతున్నారా ?

సాధారణంగా చాలా మంది పూజ సమయంలో దైవం వద్ద ఎన్నో రకాల పుష్పాలను సమర్పించి పూజలు చేస్తారు. అయితే చాలా మంది ప్రతి రోజు ఈ పుష్పాలను తొలగించి మరికొన్ని పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అయితే కొందరు ఒక రోజు దేవుడికి పెట్టిన పువ్వులు వాడిపోయినప్పటికీ అలాగే వదిలేస్తారు. అయితే ఇలా ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉండటం మంచిది కాదని ఎన్నో పరిస్థితులకు దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దేవుడికి సంబంధించిన పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని తీయకుండా అలాగే ఉంచడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని, వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకోసమే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలు ఉండకూడదు. ఇలా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో కలహాలు, కొట్లాటలు, మానసిక శాంతి, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

what happens if you put dry flowers before god

అందుకోసమే ప్రతి రోజూ పువ్వులను మనం సమర్పించక పోయినా ఫర్వాలేదు కానీ వాడిపోయిన పుష్పాలను ఇంటిలో ఉంచకూడదు. వాటిని తొలగించినప్పుడే ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి అన్ని శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుందో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.

Admin

Recent Posts