Tea spoon Vs Table spoon : వంటల ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్కరికీ ఇదో పెద్ద డౌట్. అసలు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి..? ఈ రెండింటికీ మద్య తేడా ఏంటి..? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అసలు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీస్పూన్.. ఈ రెండింటికీ మధ్య తేడాలు ఏమిటి.. ఏది పెద్దది.. అన్న విషయాలకు వస్తే.. టేబుల్ స్పూన్ అనే పదం 1700 సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో హోటల్స్ కు కానీ, ఫంక్షన్స్ కు కానీ వచ్చే వారు తమ స్పూన్స్ ను తామే ఇంటి దగ్గరి నుండి తెచ్చుకునేవారట. ముఖ్యంగా స్వీట్స్ తినేందుకు, సూప్స్ తాగేందుకు వీటిని ఉపయోగించేవారట. ఒకరి ఎంగిలి ఇంకొకరికి అంటొద్దు అనే పద్దతిలో ఎవరి స్పూన్స్ వారే తెచ్చుకునేవారట.
కాలక్రమేణా హోటల్స్, ఫంక్షన్స్ లో స్వీట్స్, సూప్స్ ను తీసుకునేందుకు ఉపయోగించే స్పూన్లను టేబుల్ మీదే అరేంజ్ చేయడంతో దానికి టేబుల్ స్పూన్ అనే పేరు ఫిక్స్ అయిపోయింది. ఇలా అరేంజ్ చేసినప్పటికీ చాలా రోజులపాటు స్పూన్స్ ను ఇంటి దగ్గరి నుండే తెచ్చుకునేవారట. తర్వాత అక్కడే అరేంజ్ చేసిన టేబుల్ స్పూన్స్ కు అలవాటు పడిపోయారట. అలా క్రమంగా ఇంటి దగ్గర నుంచి స్పూన్స్‌ను తెచ్చుకోవడం తగ్గింది. ఇక అసలు విషయానికి వస్తే..
టీస్పూన్, టేబుల్ స్పూన్.. ఈ రెండింటిలోనూ టేబుల్ స్పూన్ పెద్దది అని చెప్పవచ్చు. 1 టేబుల్ స్పూన్ అంటే 3 టీస్పూన్ల పరిమాణం వస్తుంది. అలాగే 1 టీస్పూన్‌లో 5 ఎంఎల్ వరకు పడుతుంది. అదే 1 టేబుల్ స్పూన్ అంటే 15 ఎంఎల్ వరకు పరిమాణం పడుతుంది. ఇలా ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర టీ అనగానే అల్రెడీ చక్కెర కలిపిన టీ ని ఇస్తారు. కానీ ఇతర దేశాల్లో టీ అంటే పాలు, డికాషన్ కలిపిన మిశ్రమాన్ని మాత్రమే ఇస్తారు. చక్కెరను విడిగా ఇస్తారు.
మనకు కావాల్సిన మోతాదులో మనమే చక్కెరను కలుపుకొని తాగాలి. సో అలా కలుపుకోడానికి వీలుగా ఓ స్పూన్ ను కూడా ఇస్తారు. దాన్నే టీ స్పూన్ అంటారు. ఇందులో 5 ఎంఎల్ ద్రవం లేదా 5 గ్రాముల ఘన పదార్థం పడుతుంది. అదే టేబుల్ స్పూన్ అయితే 15 ఎంఎల్ ద్రవం లేదా 15 గ్రాముల వరకు ఘన పదార్థం పడుతుంది. ఇలా ఈ స్పూన్లను ఉపయోగించుకోవాలి. కనుక ఇకపై టీస్పూన్, టేబుల్ స్పూన్ మధ్య తేడా ఏమిటి ? అని కన్‌ఫ్యూజ్ అవకండి.