వినోదం

Allu Sirish : అల్లు అర్జున్‌లా అల్లు శిరీష్ స‌క్సెస్ కాలేక‌పోవ‌డానికి.. కార‌ణాలు ఇవేనా..?

Allu Sirish : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌లో సుస్థిర‌మైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయ‌న చేసే చిత్రాల్లో చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. ఇక గ‌త చిత్రాల‌ను తీసుకుంటే బ‌న్నీ వ‌రుస హిట్స్‌తో కెరీర్‌లో ఎన్న‌డూ లేనంత పీక్ స్థాయిలో దూసుకుపోతున్నాడు. ఈయ‌న న‌టించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ ద్వారా బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో బాలీవుడ్ ద‌ర్శ‌కులు సైతం ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఓ వైపు అల్లు అర్జున్ త‌న కెరీర్‌లో ఇలా అప్ర‌తిహ‌తంగా దూసుకుపోతుండ‌గా.. ఆయ‌న సోద‌రుడు అల్లు శిరీష్ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోతున్నాడు. ఈయ‌న న‌టించిన చిత్రాల్లో కొత్త‌జంట అనే మూవీ ఒక‌టి మాత్ర‌మే ఫ‌ర్వాలేద‌నిపించింది. మిగిలిన‌వ‌న్నీ ఫ్లాప్ అయ్యాయి.

త‌న సోద‌రుడు ఓ బడా హీరో.. ఇంకో అన్న స్టార్ నిర్మాత‌.. తండ్రికి పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఉంది.. అయిన‌ప్ప‌టికీ అల్లు శిరీష్ మాత్రం సినిమాల్లో స‌క్సెస్ కాలేక‌పోతున్నాడు. అయితే శిరీష్ కోసం అల్లు అర‌వింద్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్లాన్స్ ఏవీ వ‌ర్క‌వుట్ కాలేద‌ని తెలుస్తోంది. అయితే బ‌న్నీ స‌హ‌జంగానే మృదు స్వ‌భావి అట‌. ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల ద‌గ్గ‌ర‌కి స్వ‌యంగా వెళ్ల‌డ‌మే కాకుండా.. వారు చెప్పేది గంట‌ల త‌ర‌బ‌డి ఓపిగ్గా వింటాడ‌ట‌. అర్థం చేసుకుంటాడ‌ట‌. కానీ శిరీష్ అలా కాద‌ట‌. చాలా మొండిగా ఉంటాడ‌ని.. అస‌లు ఎవ‌రు చెప్పినా విన‌డ‌ని.. మ‌ర్యాద‌గా ఉండ‌డ‌ని ఫిలిం న‌గ‌ర్‌లో టాక్ న‌డుస్తోంది. క‌నుక‌నే శిరీష్ అన్ని అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతున్నాడ‌ని.. సినిమా కెరీర్‌లో త‌న సోద‌రుడు అల్లు అర్జున్ లా ముందుకు సాగ‌లేక‌పోతున్నాడ‌ని.. వార్త‌లు వ‌స్తున్నాయి.

why allu sirish is not succeeded like allu arjun

అయితే ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా స‌రే.. ల‌క్ కూడా ఉండాలి. అలాగే ప్రేక్ష‌కులు కూడా ఆద‌రించాలి. అప్పుడే ఎవ‌రైనా స‌రే హీరోలుగా మారుతారు. ఇప్ప‌టికే ఎంతో మంది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్ప‌టికీ హీరోలుగా మారారు. క‌నుక సినిమా ఇండ‌స్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండ‌డం అనేది పూర్తిస్థాయిలో వ‌ర్క‌వుట్ అవ‌దు. అది కాస్త బూస్టింగ్ మాత్ర‌మే ఇస్తుంది. కానీ ప్రేక్ష‌కులు ఆద‌రించాలి. అదృష్టం ఉండాలి. ప్రేక్ష‌కులకు న‌చ్చే క‌థ‌లు ఉండే సినిమాలు తీయాలి. అప్పుడే స్టార్ హీరో అవుతారు. మ‌రి శిరీష్ ఈ విధంగా చేస్తాడా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Admin

Recent Posts