ఆధ్యాత్మికం

Naivedyam : దేవుళ్ల‌కు ఏయే పండ్ల‌ను నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసా..?

Naivedyam : ప్రతి రోజూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. అలానే అందరూ దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే, ఎలాంటి ఫలితం కనిపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు, పూలు, కొబ్బరికాయ వంటివి దేవుడి కోసం తీసుకు వెళ్తూ ఉంటాం. భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తి అవుతాయి. పై అధికారుల నుండి ఎలాంటి సమస్యలు కూడా రావు.

అదే అరటిపండుని పెడితే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జు కింద తీసి, దానిని నైవేద్యంగా పెడితే అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. మధ్యలో ఆగిపోయిన పనులు కూడా నెరవేరుతాయి. నేరేడు పండ్లను నైవేద్యం కింద పెడితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. భోజనంతో పాటుగా నేరేడు పండ్లని ఎవరికైనా వడ్డిస్తే అన్న పానీయాలకి లోటు ఉండదు.

which naivedyam is best for gods

దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్లను పెడితే సుఖసంతోషాలతో ఉండొచ్చు. నైవేద్యంగా ద్రాక్ష పండ్లు పెట్టి వాటిని చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పంచితే సుఖసంతోషాలు ఎప్పుడూ ఉంటాయి. ద్రాక్ష పండ్లను దానం చేస్తే పక్షవాత రోగాలు పోతాయి. మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే గృహ నిర్మాణ సమస్యలు తొలగిపోతాయి. ఇష్టదైవానికి తేనె, మామిడి రసం నైవేద్యంగా పెట్టి దానిని అందరికీ పంచితే మోసం చేసిన వాళ్లలో మార్పు వస్తుంది. అంజీర పండ్లను నైవేద్యంగా పెడితే అనారోగ్య బాధలు పోతాయి. కీళ్ల నొప్పులు కూడా ఉండవు.

సపోటా పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే చికాకులు తొలగిపోతాయి. ఆపిల్ పండ్లని పెడితే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దరిద్ర బాధ ఉండదు. ధనవంతులు అవుతారు. కమలా పండ్లను పెట్టడం వలన పనులు సరైన టైమ్ కి పూర్తవుతాయి. పనస పండును నైవేద్యం కింద పెడితే శత్రు జయం కలుగుతుంది. రోగ నివారణతోపాటు కష్టాలన్నీ తొలగిపోతాయి. జామ పండ్లను పెడితే ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. చక్కెర వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

Admin

Recent Posts