వినోదం

ANR : ఆ హీరోల‌తో ఏఎన్నార్ చేసిన మూవీలు అన్నీ ఫ్లాప్.. అవేమిటంటే..?

ANR : ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను త‌న న‌ట‌న‌తో ఏలిన న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర్ రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లో ఈయ‌న అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉండేవారు. ఈయ‌న చేసిన అనేక చిత్రాల్లో ప్రేమ అనే అంశం బ‌లంగా ఉండేది. దీంతో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ను కూడా ఏఎన్నార్ సొంతం చేసుకున్నారు. ప్రేమ క‌థ‌తో వ‌చ్చిన ఏఎన్నార్ చిత్రాలు దాదాపు అన్నీ హిట్ అయ్యాయి. అయితే వ‌య‌స్సు పైబ‌డిన అనంత‌రం ఏఎన్నార్ ప‌లువురు యంగ్ హీరోల‌తో అప్ప‌ట్లో మూవీలు చేశారు. కానీ ఆయ‌న చేసిన ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ మూవీలు ఏమిటంటే..

వెంక‌టేష్ అప్ప‌ట్లో క‌లియుగ పాండ‌వులు సినిమా చేసి ఎంతో జోష్ మీదున్నాడు. అందులో భాగంగానే ఆయ‌న ఏఎన్నార్‌తో క‌లిసి బ్ర‌హ్మ రుద్రులు అనే మూవీ చేశారు. అయితే అది ఫ్లాప్ అయింది. త‌రువాత మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి నాగేశ్వ‌ర్ రావు మెకానిక్ అల్లుడు అనే మూవీలో న‌టించారు. దీన్ని బి.గోపాల్ తెర‌కెక్కించ‌గా ఇందులో చిరుకు జోడీగా విజ‌య‌శాంతి న‌టించింది. ఇది రొటీన్ స్టోరీ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా న‌చ్చ‌లేదు. అలా ఏఎన్నార్ న‌టించిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది.

those anr acted movies were flop

ఆ త‌రువాత బాల‌కృష్ణ‌తో క‌లిసి ఏఎన్నార్ గాండీవం అనే సినిమాలో న‌టించారు. దీంట్లో మోహ‌న్ లాల్ కూడా యాక్ట్ చేశారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇక ఆ త‌రువాత త‌న త‌న‌యుడు నాగార్జున‌తో క‌లిసి ఇద్ద‌రూ ఇద్ద‌రే అనే మూవీలోనూ నాగేశ్వ‌ర్ రావు యాక్ట్ చేశారు. అయితే తండ్రీ కొడుకుల కాంబినేష‌న్ అనేస‌రికి సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం నిరాశ‌ప‌రిచింది.

అలా ఏఎన్నార్ ఇత‌ర హీరోల చిత్రాల్లో క‌ల‌సి న‌టించ‌గా.. అవ‌న్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇది యాదృచ్ఛిక‌మో మ‌రొక‌టో తెలియ‌దు కానీ.. ఏఎన్నార్‌కు మాత్రం ఇలా క‌ల‌సి మూవీలు చేయ‌డం అచ్చి రాలేదు.

Admin

Recent Posts