హిందూ పంచాంగం ప్రకారం వారాలలో బుధవారం నాలుగోది. ఈ పవిత్రమైన రోజున ఆది దేవుడు, విఘ్నాలు తొలగించే వినాయకుడికి అంకితం ఇవ్వబడింది. అందుకే ఈ పర్వదినాన గణేశుడిని పూజిస్తారు. మనలో ఎవరైనా ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు ముందుగా వినాయకుడినే పూజిస్తాం. ఇలా చేయడం వల్ల తమ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం లభిస్తుందని భావిస్తారు. అంతేకాదు బుధవారం రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కెరీర్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ సందర్భంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలా పూజలు చేయాలి.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయకుడిని జ్ఞానానికి సంబంధించిన దేవుడు అని అంటారు. గణేశుని ఆశీస్సులు ఉంటూ మీరు పాల్గొనే పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. అంతేకాదు మనం చేసే పనుల్లో కచ్చితంగా పురోగతి లభిస్తుంది. వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు, కెరీర్లో సక్సెస్ సాధించేందుకు బుధవారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. శాస్త్రాల ప్రకారం, బుధవారం రోజున అవసరమైన వారికి వస్తువులను దానం చేయాలి. అంతేకాదు పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేయొచ్చు. వివాహిత మహిళలకు పచ్చని రంగులో ఉండే గాజులను దానం చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయని నమ్ముతారు. వీటిని దానం చేయడం వల్ల కెరీర్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుంది.
శాస్త్రాల ప్రకారం, వినాయకుడి అనుగ్రహం పొందాలనుకునే వారు బుధవారం రోజున శాస్త్రోక్తంగా గణపతి దేవుడిని పూజించాలి. ఆ దేవ దేవుడిని పూజించే సమయంలో ఓం గ్లౌం గణపత్యే నమః అనే మంత్రాన్ని జపించాలి. మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు వినాయకుడి ఆశీస్సులు మీపై శాశ్వతంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.