ఆధ్యాత్మికం

Homam : హోమాలు ఎందుకు చేస్తారు..? ఏ హోమం వలన ఎలాంటి లాభం ఉంటుందో తెలుసా..?

Homam : ఎవరైనా ఇంట్లో కానీ లేదంటే ఆలయాల్లో కానీ హోమాలు జరపడం మనం చూస్తూ ఉంటాం. హోమం చేయడం వలన ఏమవుతుంది, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం హోమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే పరిహారం కింద హోమం చేస్తూ ఉంటారు. సకాలంలో వానలు కురవాలని కూడా హోమాలని చేస్తూ ఉంటారు. హోమాలని పూర్వకాలం నుండి కూడా చేస్తున్నారు.

గ్రహాల ప్రభావంతో ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉంటే శాంత పరచడానికి హోమాలు చేస్తూ ఉంటారు. హోమం చేయడం వలన మనం కోరుకున్న కోరికల్ని అగ్నిదేవుడు దేవుళ్ళకి నేరుగా చెప్తాడ‌ని మన నమ్మకం. అయితే హోమాల్లో చాలా రకాలు కూడా ఉంటాయి. జీవితంలో చాలా మంది చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు. వాటి నుండి బయటపడడానికి హోమాలని చేస్తారు. వినాయకుడి అనుగ్రహం పొందాలని వినాయకుడికి హోమం చేస్తూ ఉంటాము.

why do homam what are the benefits

గణపతి హోమం చేస్తే ఆర్థిక సమస్యలు వుండవు. శివ హోమం చేయడం వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు. పెళ్లి విషయంలో ఇబ్బందులు వచ్చి, రెండు కుటుంబాలు కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలలో ఇటువంటి హోమాలను చేస్తారు. సోమవారం నాడు ఈ హోమం చేస్తారు. విద్యలో వెనకబడి ఉన్నట్లయితే, నీల సరస్వతి దేవి హోమం చేస్తారు. సిద్ది గణపతి హోమం, దక్షిణామూర్తి హోమం, విద్యా గణపతి హోమం వంటివి కూడా చేస్తూ ఉంటారు.

కొంతమంది పరోక్షంగా ఇతరులని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ల‌ నుండి రక్షణని పొందడానికి మహా సుదర్శన హోమాన్ని చేస్తారు. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు కుబేర లక్ష్మి హోమాన్ని చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు ధన్వంతరి హోమాన్ని చేస్తారు. అలానే నవగ్రహ హోమాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల హోమాలు ఉన్నాయి. హోమం చేయడం వలన సమస్యల నుండి బయట పడొచ్చు. మన కష్టాలు తొలగిపోతాయి. అనుకున్నవి జరిగి సుఖంగా ఉండొచ్చు.

Admin

Recent Posts