information

వెయ్యిని సూచించ‌డానికి T అనే అక్ష‌రానికి బ‌దులు K అనే అక్ష‌రాన్ని ఎందుకు వాడ‌తారంటే..?

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది వెయ్యిని రాయ‌డానికి ఒక లెట‌ర్ జ‌త చేస్తున్నారు. వెయ్యిని ఇంగ్లీష్‌లో థౌజెండ్ అంటాం. అంటే టీ అనే అక్ష‌రంతో మొద‌ల‌వుతుంది. అలాంట‌ప్పుడు వేల‌ని సూచించాలంటే 1టీ, 2టీ,5 టీ అని చెప్పాలి. కాని 1 కే, 2కే ,5 కే అని చెప్ప‌డం మ‌నం చూస్తూ ఉంటాం. వెయ్యి స్థానంలో K కి బదులుగా T ని ఎందుకు వినియోగించకూడదో ఎప్పుడైనా థింక్ చేశారా?.సాధారణంగా ‘M’ అనేది మిలియన్‌కి ఉపయోగించబడుతుంది.. అయితే ‘B’ బిలియన్‌కి ఉపయోగించబడుతుంది. అలాంటప్పుడు T అనేది వెయ్యికి అక్షరం కావాలి క‌దా, అలా కాకుండా ‘K’తో ఎందుకు ఉపయోగిస్తారు.దీని వెన‌క పెద్ద క‌థే ఉంది. పెద్ద కథే ఉంది. గ్రీకు భాషలో వెయ్యిని ‘కీలియోయ్‌’ అని పలుకుతారు.

ఆ తర్వాత దాన్ని ఫ్రెంచ్‌లో సులభంగా పలికేలా ‘కిలో’గా మార్చారు. ఆపైన మెట్రిక్‌ పద్ధతి అమల్లోకి వచ్చినప్పటి నుంచీ కిలోను 1000కి సూచనగా వాడటం మొదలెట్టారు. కిలోగ్రామ్‌, కిలోలీటర్‌, కిలోటన్‌ వంటి పదాలు పుట్టుకొచ్చాయి. దాన్ని డబ్బుకు కూడా అనుసంధానం చేస్తూ పక్కన మూడు సున్నాలు పెట్టకుండా సింపుల్‌గా ‘కె’ అని పెట్టి వదిలేయడం అలవాటైంది.అలా కిలో అనే పదంలో మొదటి అక్షరమైన K ని వెయ్యికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తూ వస్తున్నారు. 10 వేలు, 50 వేలు అని రాసేబదులు.. 10K, 50K అని రాస్తూ వస్తున్నారు. అదే విధానాన్ని ప్రపంచ దేశాలు పాటిస్తూ వస్తున్నాయి.

why k letter is used for thousand

వాస్తవానికి, అనేక పాశ్చాత్య దేశాలు గ్రీకు మరియు రోమన్ సంస్కృతిచే ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వెయ్యికి ‘K’ అనే అక్షరాన్ని ఉపయోగించడం కూడా రోమన్ సంస్కృతి నుండి వచ్చింది. గ్రీకు భాషలో ‘చిల్లోయ్’ అంటే వెయ్యి. అంతేకాకుండా, బైబిల్‌లో కూడా K అనే పదాన్ని వేలల్లో ఉపయోగించారు. అలా ఇప్పుడు ఎక్క‌డా చూసిన కూడా వేల‌లో చెప్పాల్సిన‌ప్పుడు K అనే అక్ష‌రం ఉప‌యోగించి సింపుల్‌గా చెప్పేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో మ‌నం ఎక్కువ‌గా దీనిని గ‌మనిస్తుంటాం. ఫాలోవ‌ర్స్, వ్యూస్ చూసేట‌ప్పుడు 5K ఫాలోవ‌ర్స్ లేదంటే 3K వ్యూస్ ఇలా క‌నిపిస్తుంటాయి.

Sam

Recent Posts