వినోదం

Puneeth Rajkumar : ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాతో హిట్ అందుకున్న పునీత్‌.. అదేంటో తెలుసా..?

Puneeth Rajkumar : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వైవిధ్య‌మైన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ న‌టించిన చిత్రం ఆంధ్రావాలా. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, చిత్రం భారీ ఫ్లాప్ ను మూట‌గ‌ట్టుకుంది. సింహాద్రి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. నిమ్మకూరులో జరిగిన ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు.

దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు నడిపినట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే భారీ హైప్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో అభిమానుల కూడా డీలా ప‌డ్డారు. అయితే ఈ సినిమాని ధైర్యంగా పునీత్‌ రాజ్ కుమార్ చేయ‌డం విశేషం. ఆంధ్రావాలా సినిమా క‌న్న‌డ రీమేక్ లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా న‌టించాడు. ఈ సినిమాతో క‌న్న‌డ‌నాట బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఇది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

puneet rajkumar got blockbuster hit with ntr flop movie

ఇక పునీత్- ఎన్టీఆర్ మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విష‌యం తెలిసిందే. పునీత్ సినిమాలో ఎన్టీఆర్ పాట‌లు కూడా పాడారు. కాగా అప్ప‌ట్లో పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం ఎన్టీఆర్‌ని ఎంత‌గానో క‌ల‌చివేసింది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఇడియట్ సినిమా రీమేక్ అప్పుతో పునీత్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధిచ‌డంతో పునీత్ కు ఎంతో క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా మహేశ్ బాబు హీరోగా న‌టించిన దూకుడు సినిమాను కూడా క‌న్న‌డ‌లో రీమేక్ చేశాడు.

Admin

Recent Posts