lifestyle

క‌డ‌క్‌నాథ్ కోళ్లు ఎందుకు అంత ధ‌రను క‌లిగి ఉంటాయో తెలుసా ?

క‌డ‌క్‌నాథ్ కోళ్ల గురించి చాలా మందికి తెలుసు. వాటి శ‌రీరం మొత్తం న‌ల్ల రంగులో ఉంటుంది. అయితే ఈ కోళ్ల మాంసం, గుడ్లు చాలా ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణ బ్రాయిల‌ర్ కోళ్లు కేవ‌లం 45 రోజుల్లోనే సుమారుగా 2.50 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయి. కానీ క‌డ‌క్‌నాథ్ కోళ్లు పెరిగేందుకు అధిక స‌మ‌యం ప‌డుతుంది. 6 నెల‌లు పెంచిన‌ప్ప‌టికీ అవి 1.50 కిలోల వ‌ర‌కు బ‌రువు మాత్రమే పెరుగుతాయి. దీంతో వాటిని పెంచేందుకు ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది. క‌నుక స‌హ‌జంగానే ఈ కోళ్ల‌కు ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది.

why kadaknath chicken price is higher

ఇక సాధార‌ణ లేయ‌ర్ కోళ్ల‌తో పోలిస్తే క‌డక్‌నాథ్ కోళ్లు చాలా త‌క్కువ గుడ్లు పెడ‌తాయి. అవి పిల్ల‌లుగా అయ్యే అవ‌కాశాలు కూడా త‌క్కువే. అందుక‌నే ఆ గుడ్ల‌కు ఖ‌రీదు ఎక్కువ‌. అయిన‌ప్ప‌టికీ సాధార‌ణ కోళ్ల‌తో పోలిస్తే ఈ కోళ్ల మాంసంలో పోష‌క విలువలు ఎక్కువ‌గా ఉంటాయి. కొవ్వు త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల క‌డ‌క్‌నాథ్ కోళ్లు స‌హ‌జంగానే ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. ఇవీ.. వాటి మాంసం, గుడ్లు ఎక్కువ ధ‌ర ఉండ‌డం వెనుక ఉన్న కార‌ణాలు.

ఇక క‌డ‌క్‌నాథ్ కోళ్ల మాంసం ధ‌ర కేజీకి రూ.1000 నుంచి రూ.1200 వ‌ర‌కు ప‌లుకుతుండ‌గా, ఒక్క కోడి ధ‌ర రూ.850గా ఉంది. ఒక్క క‌డ‌క్‌నాథ్ కోడిగుడ్డు ధ‌ర రూ.30 వ‌ర‌కు ఉంది.

Admin

Recent Posts