పోష‌ణ‌

జింక్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే.. ఈ సమస్యలు త‌గ్గుతాయి..!

మన శరీరానికి రోజూ అన్ని పోషకాలు అవసరం అవుతాయి. కొన్ని పోషకాలు కొన్ని రకాల పదార్థాల్లో లభిస్తాయి. ఇంకొన్ని ఇంకొన్నింటిలో అందుతాయి. అయితే ఏ పోషకం అయినా సరే మనకు కావల్సిందే. ఇక మన శరీరానికి కావల్సిన విటమిన్లలో జింక్‌ ఒకటి. జింక్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జింక్‌ ఉన్న ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా తయారవుతుంది. దీంతో సంతాన లోపం సమస్య తగ్గుతుంది.

2. జింక్‌ ఉన్న ఆహారాలను తీసుకుంటే మొటిమలు, గజ్జి, ఇతర చర్మ సమస్యలు తగ్గుతాయి.

take these zinc rich foods for many benefits

3. గాయాలు, పుండ్లు త్వరగా మానాలంటే జింక్‌ ఉండే ఆహారాలను తీసుకోవాలి. జింక్‌తో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రుచి, వాసన తెలుస్తాయి.

4. జింక్‌ ఉండే ఆహారాలను తీసుకుంటే ఫ్రీ ర్యాడికల్స్‌ నశిస్తాయి.

5. జింక్‌ ఆహారాలను తీసుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.

జింక్‌ ఎక్కువగా మనకు సీఫుడ్‌, గుమ్మడికాయ విత్తనాలు, వేరుశెనగలు, డార్క్‌ చాకొలెట్‌, పుచ్చకాయలు, మటన్‌, పీతలు తదితర ఆహారాల్లో లభిస్తుంది.

Admin

Recent Posts