food

ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు తయారీ విధానం

సాధారణంగా మనం మినప్పప్పు లేదా అలసంద పప్పు తో వడలు తయారు చేసుకొని ఉంటాము. కానీ కొంచెం భిన్నంగా రుచికరంగా తినాలనిపించే వారు మొక్క జొన్న లతో వడలు తయారు చేసుకుని ఆ రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

లేత మొక్కజొన్న గింజలు రెండు కప్పులు, శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి రెండు టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్కలు, జీలకర్ర ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కప్పు ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, అర కప్పు పచ్చిమిర్చి ముక్కలు, అర కప్పు కొత్తిమీర తురుము, కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.

mokkajonna vadalu recipe make in this method

తయారీ విధానం

ముందుగా మొక్కజొన్న గింజలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ గిన్నెలోకి తగినంత ఉప్పు జీలకర్ర అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి శెనగపిండి, బ్రెడ్ పౌడర్,మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తురుము పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ క్రమంలోనే స్టవ్ మీద కడాయి లో నూనె పెట్టి బాగా మరిగిన తర్వాత ఈ మొక్కజొన్న పిండి మిశ్రమంతో వడలు మాదిరిగా వేసి వేయించుకుని వడలు ఎరుపు రంగులోకి రాగానే తీసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న వడలు తయారైనట్లే.

Admin

Recent Posts