mythology

కురుక్షేత్ర యుద్ధం ఆ స్థలంలో జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం మహాభారతం అనగానే కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి చర్చిస్తారు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో కౌరవులు వందమంది చనిపోతారు. కౌరవులు పాండవుల మధ్య యుద్ధం ప్రకటించిన సమయంలో యుద్ధం ఎక్కడ అనేది ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. వీరిద్దరి మధ్య యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరగాలని ధృతరాష్ట్రుడు నిర్ణయించాడు. ఈ విధంగా దృతరాష్ట్రుడు ఆ స్థలంలోనే యుద్ధం జరగడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అను ప్రదేశం ఉంది. ఈ ప్రాంతం చుట్టూ ఎనిమిది నదులు ప్రవహించడం చూసిన ఒక రాజు ఎంతో మంత్రముగ్ధుడై ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయాలని తన బంగారు రథం నుంచి అక్కడ అడుగు పెట్టాడు. రథం నుంచి దిగిన రాజు నాగలిని తయారుచేసి శివుడి వాహనం నందిని యముడి వాహనం మహిషాన్ని తీసుకొని నాగలితో యుద్ధం చేయసాగాడు.ఇది చూసిన విష్ణు మూర్తి అతని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడగగా అందుకు రాజు వ్యవసాయం చేస్తున్నాను అని సమాధానం చెబుతాడు.

why kurukshetra war happened in that place

ఈ క్రమంలోనే విత్తనాలు ఎక్కడ అని విష్ణుమూర్తి అడిగితే తన శరీరంలో ఉన్నాయని చెబుతాడు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి ఏది చూపించు అంటూ కురు అనే రాజు తన శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా చేస్తున్నప్పటికీ ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఉండటం వల్ల మంత్ర ముగ్ధుడైన విష్ణుమూర్తి తిరిగి తన శరీరాన్ని పూర్వ రూపానికి తెచ్చి ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు రాజు ఈ ప్రాంతం తన పేరు మీదుగా వర్ధిల్లాలని, ఇక్కడ మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని వరం కోరగా అందుకు విష్ణుమూర్తి తథాస్తు అని వరమిచ్చాడు.

ఇక మహాభారతం విషయానికి వస్తే ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత తెలుసుకున్న కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు యుద్ధం ఏ ప్రాంతంలో జరగాలని నిర్ణయించాడు. యుద్ధంలో తన కుమారులు ఎలాగో మరణిస్తారు కనుక వారికి స్వర్గ ప్రాప్తి కలగాలని కురుక్షేత్ర యుద్ధం ఈ ప్రాంతంలో జరగాలని నిర్ణయిస్తాడు. ఈ విధంగా ఈ కురుక్షేత్ర భూమిలో మరణించిన కౌరవులకు మరణాంతరం స్వర్గప్రాప్తి కలిగిందని చెప్పవచ్చు.

Admin

Recent Posts