Off Beat

రైలు చివ‌రి బోగీ వెనుక X అనే సింబ‌ల్ ఎందుకు ఉంటుందో తెలుసా ?

రైలు ప్ర‌యాణం అంటే దాదాపుగా ఎవ‌రికైనా స‌రే అత్యంత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల్లో ప్ర‌యాణిస్తే చాలా మందికి వాంతులు అవుతాయి. కానీ రైలు ప్ర‌యాణం అలా కాదు. చాలా సౌక‌ర్యంగా ఉంటుంది. అయితే రైళ్ల‌లో ప్ర‌యాణించేట‌ప్పుడు స‌హ‌జంగానే రైలు బోగీల‌పై, రైల్వే స్టేష‌న్ల‌లో బోర్డుల‌పై ప‌లు ప్ర‌త్యేక అంకెలు, అక్ష‌రాలు, చిహ్నాల‌ను చూస్తుంటాం. ఈ క్ర‌మంలోనే రైలు చివ‌రి బోగీ వెనుక భాగంలో ఆంగ్ల అక్ష‌రం X అనే సింబ‌ల్‌ను వేస్తారు. అయితే దీన్ని ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

రైలు చివ‌రి భాగంలో ఉండే బోగీ వెనుక ప‌సుపు లేదా తెలుపు రంగులో ఆంగ్ల అక్ష‌రం X ను పోలిన సింబ‌ల్ ఉంటుంది. అలాగే ఆ సింబ‌ల్ ద‌గ్గ‌ర‌గా LV అనే అక్ష‌రాలు కూడా ఉంటాయి. LV అంటే లాస్ట్ వెహికిల్ అని అర్థం. ఇక బోగీ వెనుక భాగంలో ఒక చిన్న ఎల్లో క‌ల‌ర్ బోర్డు కూడా ఉంటుంది. ఇది రెండు వైపులా ఉంటుంది. దీంతోపాటు X అనే సింబ‌ల్ కింది భాగంలో ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది.

why there is x symbol on train last bogie

బోగి వెనుక భాగంలో X అనే సింబ‌ల్ ఉందంటే అది ఆ రైలుకు చెందిన చివ‌రి బోగీ అని అర్థం. దీంతో ప్ర‌మాదాలు కాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. రైలు చివ‌రి బోగీ వెనుక భాగంలో X అనే సింబల్ లేక‌పోతే కొన్ని బోగీలు విడిపోయాయ‌ని అర్థం. దీంతో వెంట‌నే సిబ్బంది అల‌ర్ట్ అయి ప్రమాదాలు జ‌ర‌గ‌కుండా చూస్తారు. ఇక రైల్వే స్టేష‌న్‌లో ఉండే గార్డు ప్లాట్ ఫాంపై రైలు చివ‌రి బోగీ వెనుక భాగంలో ఉండే X సింబ‌ల్ ను చూస్తాడు. దీంతో అన్ని బోగీలు క‌నెక్ట్ అయి ఉన్నాయ‌ని నిర్దారించి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడు. దీంతో రైలు క‌దులుతుంది.

ఇక రాత్రి పూట X సింబ‌ల్ కింద ఉండే రెడ్ లైట్ చివ‌రి బోగీని నిర్దారించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. రాత్రి పూట ఆ లైట్ వెల‌గ‌క‌పోయినా, బోగీపై X సింబ‌ల్ ప్ర‌కాశిస్తూ క‌నిపించ‌క‌పోయినా సిబ్బంది అల‌ర్ట్ అవుతారు. రైలు ప్ర‌మాదానికి గురి కాకుండా చూస్తారు. ఇలా X సింబ‌ల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Admin

Recent Posts