వినోదం

Rajamouli : రాజ‌మౌళి త‌న జేబులో ఒక్క రూపాయి కూడా పెట్టుకోర‌ట‌.. ఎందుకో తెలుసా..?

Rajamouli : తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత దర్శకధీరుడు రాజమౌళికి మాత్రమే సొంతం. ఓ తెలుగు సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయన రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సత్తా ఎలాంటిదో చాటిచెప్పాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కి , ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై సంవ‌త్స‌రాలు గడుస్తున్నా కూడా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ పాటలు, డైలాగులు, సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు, డైరెక్టర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన వీడియోలు బాగా హల్ చల్ చేస్తున్నాయి.

మరి ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి గురించి ఆయన అలవాట్లు, ఇతర విషయాల గురించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో రాజమౌళి సతీమణి రమా రాజమౌళిని ఓ ఛానల్ వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. అయితే ఆ సమయంలో రాజమౌళి ఇంట్లో ఎలా ఉంటారు? సినిమా ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటారు? అనే ప్రశ్నలు యాంకర్ రమా రాజమౌళిని అడగటం జరిగింది.

why rajamouli does not keep money with him

ఇంట్లో పిల్లలతో ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. వారు చెప్పే ప్రతి విషయం చాలా శ్రద్ధగా గ్రహిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది రమ. అతను చాలా టాలెంటెడ్ పర్సన్ అంటూ భర్త గురించి గొప్పగా పొగిడేసింది. అదేవిధంగా డబ్బు పైన ఆయనకు అంతగా ఆసక్తి ఉండదు. డబ్బు విషయం అసలు పట్టించుకోరు. ఎవరైన ఆయన దగ్గర డబ్బు ఉండవచ్చు అన్న ఆలోచనతో అతనితో బయటకు వెళ్తే ఇబ్బంది పడవలసిందే.. ఎందుకంటే అతని జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు. ఎప్పుడు ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఆ సమయంలో డబ్బు అవసరం ఉంటే కష్టం కదా.. అందుకే రాజమౌళి కారు డ్రైవర్ దగ్గర కొంత డబ్బు ఉంచమని ఇస్తాను అని చెప్పుకొచ్చింది రమా రాజమౌళి. ప్రస్తుతం రమా రాజమౌళి, రాజమౌళి గురించి చెప్పిన ఈ వీడియోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Admin

Recent Posts