వినోదం

Sri Devi : కృష్ణ సినిమా నుండి శ్రీదేవి లాంటి హీరోయిన్‌ని మ‌ధ్య‌లోనే తీసేయ‌డానికి కార‌ణం..?

Sri Devi : దివంగత అతిలోకసుందరి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని సినీ ప్రేమికులు ఉండరు. 1980-90 ద‌శ‌కాల్లో తన అందచందాలతో శ్రీదేవి ఒక ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు తమిళం – మళ‌యాళం సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవి నేషనల్ వైడ్‌గా పాపులారిటీని అందిపుచ్చుకొని త‌న‌కు ఎదురులేద‌నిపించింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయాక శ్రీదేవి తెలుగు, తమిళ సినిమాల్లో చేసేందుకు చాలా కండిషన్లు కూడా పెట్టేదన్న ప్రచారం అప్పట్లో జరిగింది.

బాల‌న‌టిగానే త‌న కెరీర్ ను ప్రారంభించిన శ్రీదేవి ఆ త‌రువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి లాంటి హీరోల‌కు పోటీగా శ్రీదేవి రెమ్యున‌రేష‌న్స్ అందుకుంది. ఆమె అంద‌చందాల‌ను వీక్షించేందుకు జ‌నాలు థియేట‌ర్స్‌కి వ‌చ్చిన రోజులు ఉన్నాయి. అయితే ఓ సారి కృష్ణ న‌టించిన అగ్ని ప‌ర్వతం సినిమాలో న‌టించే అరుదైన అవ‌కాశాన్ని ఈ అమ్మ‌డు మిస్ చేసుకుంది. ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. అగ్ని ప‌ర్వ‌తం సినిమాని అశ్వినీద‌త్ నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణ‌కు జోడీగా ర‌మ్య‌కృష్ణ, రాధ హీరోయిన్ లు గా న‌టించారు.

why sridevi dropped from krishna movie

శ్రీదేవి ఈ సినిమాను రిజెక్ట్ చేయ‌డానికి కార‌ణం ఏంటంటే మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటే త‌న పాత్ర ప్రాధాన్య‌త‌ త‌గ్గుతుంద‌ని అనుకుంద‌ట‌. అందుకే ముందుగా ఓకే చెప్పిన శ్రీదేవి త‌ర్వాత రిజెక్ట్ చేయాల్సి వ‌చ్చింది. కాగా శ్రీదేవి బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయ్యాక చిరంజీవితో రెండు సార్లు చేసే ఛాన్స్ వ‌చ్చినా ఆమె పెట్టిన కండిష‌న్ల వ‌ల్లే ఆ రెండు సినిమాలు ఆగిపోయాయ‌న్న ప్ర‌చారం కూడా ఉంది.

Admin

Recent Posts