వినోదం

ANR : హీరోయిన్ల‌తో అక్కినేని, ఎన్‌టీఆర్.. ఎలా ప్ర‌వ‌ర్తించే వారో తెలుసా..?

ANR : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రెండు క‌ళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉండేవారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏయ‌న్నార్‌ ఇద్దరూ రెండుకళ్ళు. వయసు రీత్యా ఎన్టీ‌ఆర్‌ కన్నా సుమారు 16 నెలలు చిన్నవాడు ఏయ‌న్నార్‌. సినీ రంగం విషయంలో మాత్రం ఎన్టీఆర్ కంటే ఏయ‌న్నార్‌ 5 సంవ‌త్సరాల 10 నెలల సీని‌యర్‌. చెన్నై నుండి ప‌రిశ్ర‌మ హైదరాబాద్‌కి రావ‌డానికి వీరి పాత్ర అనిర్వ‌చ‌నీయం. ఒకానొక సమయంలో టాప్ హీరోల పొజిషన్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడడం కూడా జరిగింది. అంతేకాకుండా మంచి స్నేహితులు కూడా వీరే.

ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో హిట్లు కొడుతుంటే.. జానపద చిత్రాలతో ఏయ‌న్నార్‌ రాణించారు. ఎప్పుడూ సినిమాలతో పోటీ పడ్డారే తప్ప వారికెప్పుడూ పోటీ లేదు. ఈ ఇద్ద‌రు హీరోల ప‌క్క‌న చాలా మంది క‌థానాయిక‌లు న‌టించారు. అయితే ఏఎన్ఆర్ తో ఉన్నంత చ‌నువుగా ఎన్టీఆర్‌తో హీరోయిన్స్ ఉండేవారు కాద‌ట‌. ఏఎన్ఆర్ చాలా చ‌లాకీ పర్స‌న్. త‌న ప‌క్క‌న న‌టించే ప్ర‌తి హీరోయిన్ పై జోకులు వేస్తూ ఉంటాడు. సీరియ‌స్ అయినా కూడా వారు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అక్కినేని కేవ‌లం తెలుగులోనే కాకుండా ప‌లు భాష‌ల్లో న‌టించి బ‌య‌ట హీరోయిన్స్ తో కూడా న‌టించగా అంద‌రితో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది.

ntr and anr how they behaved with actress

ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే సెట్స్ లో సీరియ‌స్ గా ఉంటారు. సినిమా సెట్‌కి వ‌చ్చామా, వెళ్లిపోయామా అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఎన్టీఆర్ తో న‌టించాల‌న్నా కూడా కొంద‌రు హీరోయిన్స్ భ‌య‌ప‌డుతూ ఉండేవారు. షూటింగ్‌కి స‌మ‌యానికి రావ‌డం లేదంటూ స్టార్ హీరోయిన్ కేఆర్ విజ‌య పైన ఎన్టీఆర్ అప్ప‌ట్లో కోర్టులో కేసు వేయ‌డం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో మ‌నంద‌రికీ తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరు హీరోలు అందించారు.

Admin

Recent Posts