lifestyle

ప్లాస్టిక్ కుర్చీల‌ను ఎప్పుడైనా గ‌మ‌నించారా.. వాటి మ‌ధ్య‌లో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఒక‌ప్పుడు మ‌న ఇండ్లలో చెక్క‌తో చేసిన కుర్చీల‌నే ఎక్కువ‌గా వాడేవారు. కానీ ఇప్పుడు కుర్చీలు రూపాంత‌రం చెందాయి. ప్లాస్టిక్‌తో త‌యారు చేసిన కుర్చీల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఇవి ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌డంతోపాటు తేలిగ్గా ఉంటాయి. ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్ల‌వ‌చ్చు. విరిగిపోతే ఇబ్బంది ఉండ‌దు. మ‌ళ్లీ కొత్త కుర్చీల‌ను కొన‌వ‌చ్చు. అందువ‌ల్ల ప్లాస్టిక్ కుర్చీల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అయితే వీటిల్లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి రెగ్యుల‌ర్‌గా కూర్చునే కుర్చీలు కాగా.. ఇంకో ర‌క‌మైన‌వి స్టూల్ రూపంలో ఉంటాయి. వీటిని కూర్చునేందుకు లేదా టీపాయ్ మాదిరిగా ఉప‌యోగిస్తారు. అయితే ఈ కుర్చీల మ‌ధ్య‌లో రంధ్రాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గ‌మ‌నించే ఉంటారు. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా కుర్చీల‌ను ఒకదానిమీద ఒకటి పెట్టినప్పుడు వాటి మధ్యలో కొంత గాలి ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ సమయంలో కుర్చీ మధ్యలో హోల్ లేకపోతే ఆ మధ్యన ఉండే గాలి వల్ల అవి చాలా టైట్ గా ఇరుక్కుపోతాయి. దీంతో వాటిని విడ‌దీయడం క‌ష్టంగా మారుతుంది. క‌నుక‌నే అలాంటి చెయిర్స్‌కు మ‌ధ్య‌లో రంధ్రాల‌ను ఏర్పాటు చేస్తారు. ఇక కుర్చీల‌ను తయారు చేసేటప్పుడు కొంత మెటీరియల్ ను పొదుపు చేయడం కోసం, తక్కువ ఖర్చులో కుర్చీని తయారు చేయడం కోసం ఈ రంధ్రాల‌ను పెడ‌తారు.

why there are holes in plastic chairs

ఇక ఈ చెయిర్స్‌కు మ‌ధ్య‌లో రంధ్రాలు ఉండ‌డం వ‌ల్ల వాటిని సుల‌భంగా ప‌ట్టుకునేందుకు వీలవుతుంది. అలాగే వాటిని ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్ల‌వ‌చ్చు. అలాగే చెయిర్స్‌కు మ‌ధ్య‌లో ఎల్ల‌ప్పుడూ రంధ్రాల‌ను వృత్తాకారంలోనే ఏర్పాటు చేస్తారు. చ‌తుర‌స్రాకారంలో రంధ్రాలు ఉండ‌వు. ఎందుకంటే చెయిర్ మీద కూర్చున్న‌ప్పుడు మ‌నం క‌లిగించే ఒత్తిడి ఆ రంధ్రం ద్వారా బ‌య‌ట‌కు గాలి రూపంలో పోతుంది. దీంతో చెయిర్ ఎక్కువ కాలం మ‌న్నుతుంది. అదే రంధ్ర లేక‌పోతే అదే ప్ర‌దేశంలో కొంత కాలానికి సుల‌భంగా ప‌గులు ఏర్ప‌డుతుంది. దీంతో కుర్చీ త్వ‌ర‌గా విరిగిపోతుంది. అందుక‌నే చెయిర్‌కు మ‌ధ్య‌లో రంధ్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా ఈ కుర్చీల‌కు మ‌ధ్య‌లో రంధ్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి వెనుక ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts