iPhone : ఐఫోన్‌కు 100 శాతం చార్జింగ్ అస్స‌లు పెట్ట‌రాదు.. ఎందుకో తెలుసా ?

iPhone : ఐఫోన్‌ను కొని వాడాల‌ని చాలా మందికి ఉంటుంది. కానీ కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఆ క‌ల‌ను నిజం చేసుకోగ‌లుగుతారు. ఇక నాణ్య‌త‌కు, మ‌న్నిక‌కు ఐఫోన్లు పెట్టింది పేరు. వాటి ద్వారా ఏ స‌ర్వీస్‌ను వాడుకున్నా స‌రే అత్యుత్త‌మ క్వాలిటీ ల‌భిస్తుంది. అలాగే బ్యాట‌రీ బ్యాక‌ప్ కూడా ఎక్కువ‌గానే వ‌స్తుంది. కానీ ఐఫోన్‌ల‌ను వాడేవారు త‌మ ఫోన్‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ 100 శాతం చార్జింగ్ చేయ‌కూడ‌దు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా యాపిల్ ఐఫోన్ల‌లో బ్యాట‌రీలు కొన్ని సైకిల్స్ త‌రువాత లైఫ్ అయిపోతుంటాయి. ఒక సైకిల్ అంటే.. ఒక‌సారి బ్యాట‌రీని 100 శాతం చార్జింగ్ చేయ‌డం అన్న‌మాట‌. బ్యాట‌రీ 100 శాతం చార్జింగ్ పూర్త‌యితే దాన్ని ఒక సైకిల్ అంటారు. ఇలా అనేక సైకిల్స్ పూర్త‌య్యే కొద్దీ బ్యాట‌రీ లైఫ్ త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా కొన్నేళ్ల‌కు బ్యాట‌రీని మార్చాల్సి ఉంటుంది.

why you should not charge your iPhone 100 percent
iPhone

అయితే ఐఫోన్‌ను 100 శాతం కాకుండా.. 80 నుంచి 90 శాతం వ‌ర‌కు మాత్ర‌మే చార్జింగ్ చేస్తే.. దాంతో సైకిల్స్ పూర్తి కావు. ఫ‌లితంగా బ్యాట‌రీ లైఫ్ త‌గ్గ‌దు. దీంతో ఎక్కువ కాలం పాటు బ్యాట‌రీ వ‌స్తుంది. బ్యాట‌రీని అంత త్వ‌ర‌గా మార్చాల్సిన అవ‌స‌రం రాదు.

ఇక ఐఫోన్‌లో 40 శాతం అంత‌క‌న్నా బ్యాట‌రీ ప‌వ‌ర్ త‌గ్గిందంటే వెంట‌నే చార్జింగ్ పెట్టాలి. దాన్ని 80 శాతం వ‌ర‌కు కొన‌సాగించాలి. ఇలా ఐఫోన్ల‌కు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. దీంతో వాటి బ్యాట‌రీ ఎక్కువ రోజుల పాటు వ‌స్తుంది. బ్యాట‌రీ మ‌రీ త‌క్కువ అయినా.. అది దాని లైఫ్‌పై ప్ర‌భావం చూపిస్తుంది. క‌నుక 40 శాతంకు వ‌చ్చిందంటే చాలు.. బ్యాట‌రీని వెంట‌నే చార్జింగ్ చేసేయాలి. 80 లేదా 90 శాతం వ‌ర‌కు చార్జింగ్ పెట్టి తీసేయాలి. యాపిల్ సంస్థ ఐఫోన్‌ల‌లో 80 శాతం చార్జింగ్ ఉంటే ఆప్టిమైజ్ చేస్తుంది. క‌నుక ఆ స్థాయిలో చార్జింగ్ పెడితే బ్యాట‌రీ లైఫ్ పెరుగుతుంది. దీని వ‌ల్ల త‌ర‌చూ బ్యాట‌రీల‌ను మార్చాల్సిన అవ‌స‌రం రాదు.

Share
Editor

Recent Posts