vastu

Amla : ఆదివారం రోజున ఉసిరికాయ‌ల‌ను ఎందుకు తిన‌కూడ‌దో తెలుసా..?

Amla : ఉసిరికాయ‌లు.. వీటిని చూడ‌గానే చాలా మందికి నోరూరుతుంది. చాలా మంది ఉసిరికాయ‌ల‌ను తింటుంటారు. ఇవి మ‌న‌కు ప్ర‌కృతి అందించిన వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని చూడ‌గానే తినాల‌నిపించేలా నోరూరిస్తుంటాయి. ఇక ఉసిరికాయ‌ల‌ను తిన్న వెంట‌నే నీళ్ల‌ను తాగితే తియ్య‌గా ఉంటుంది. దీని వ‌ల్ల చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చిన్నారులు వీటిని ఆస‌క్తిగా తింటుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉసిరికాయ‌ల వాడ‌కం ఎక్కువే. ఉసిరి చేయ‌ని మేలు అంటూ ఉండ‌ద‌ని అంద‌రూ అంటుంటారు. అంత‌లా ఉసిరి ప్ర‌సిద్ధి గాంచింది.

ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరికాయ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఉసిరికాయ అద్భుత‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. ఉసిరికాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి అంటే చాలా మందికి ఇష్ట‌మే. దీన్ని వేడిగా అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది. ఇలా ఉసిరికాయ‌ల‌ను చాలా మంది ఆస్వాదిస్తుంటారు. అయితే ఉసిరికాయ‌ల‌ను తిన‌డం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ వీటిని ఒక్క ఆదివారం మాత్రం తిన‌కూడ‌ద‌ట‌. అలా అని పండితులు చెబుతున్నారు. పెద్ద‌లు కూడా ఇదే విష‌యాన్ని మ‌న‌కు సూచిస్తుంటారు. అలాగే రాత్రి స‌మ‌యాల్లోనూ ఉసిరిని తీసుకోకూడ‌ద‌ని, ఆ పేరును కూడా ఉచ్చ‌రించ‌కూడ‌ద‌ని అంటుంటారు. అయితే ఇందుకు గ‌ల కార‌ణాలు ఏమిటో చాలా మందికి తెలియ‌వు. అవే ఇప్పుడు తెలుసుకుందాం.

why you should not take amla on sunday

సాధార‌ణంగా రాత్రి స‌మ‌యాల్లో ఉసిరి చెట్ల‌పై పాములు ఉంటాయ‌ట‌. ఆ స‌మ‌యంలో ఉసిరికాయ‌ల గురించి మాట్లాడితే అప్పుడు ఆ చెట్ల‌పై ఉండే పాముల‌ను ఇంట్లోకి ఆహ్వానించిన‌ట్లు అవుతుంద‌ట‌. ఇది ఏమాత్రం మంచిది కాదు. క‌నుక‌నే రాత్రి పూట ఉసిరికాయ‌ల గురించి మాట్లాడుకోరు. ఇక రాత్రి పూట ఉష్ణోగ్ర‌త త‌క్కువ‌గా ఉంటుంది. ఆ స‌మ‌యంలో చలువ చేసే ఆహారాల‌ను తిన‌కూడ‌దు. ఉసిరి మ‌న‌కు మిక్కిలి చ‌లువ చేస్తుంది. క‌నుక దాన్ని మ‌ధ్యాహ్న‌మే తినాలి. రాత్రి తిన‌కూడ‌దు. తింటే శ్లేష్మం ఎక్కువై శ్వాస కోశ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఉసిరికాయ‌ల‌ను రాత్రిపూట తిన‌కూడ‌దు.

అలాగే ఉసిరి కాయ‌ల‌ను ఆదివారం కూడా తిన‌కూడ‌దు. ఉసిరి ఆమ్ల గుణాన్ని క‌లిగి ఉంటుంది. శుక్ర గ్ర‌హానికి చెందిన‌ది. సూర్య గ్ర‌హానికి, శుక్ర గ్ర‌హానికి ప‌డ‌దు. క‌నుక శుక్రుడికి ఇష్ట‌మైన ఉసిరికాయ‌ల‌ను సూర్య గ్ర‌హం రోజైన ఆదివారం తిన‌కూడ‌దు. ఇలా ఉసిరికాయ‌ల‌ను తిన‌డంలో నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. లేదంటే గ్ర‌హ‌పీడ‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

Admin

Recent Posts