information

1885 One Rupee Coin : మీ ద‌గ్గ‌ర ఈ నాణెం ఉందా.. అయితే భారీ మొత్తానికి అమ్మ‌వ‌చ్చు..!

1885 One Rupee Coin : ఓల్డ్ ఈజ్ గోల్డ్‌.. అనే సామెత‌ను మీరు వినే ఉంటారు. ఒక వ‌స్తువు ఎంత పాత‌బ‌డే కొద్దీ దాని విలువ అంత పెరుగుతుంద‌న్న‌మాట‌. అందుక‌నే మ‌న పెద్ద‌లు ఆ సామెత‌ను చెబుతుంటారు. అయితే ఇది కొన్ని వ‌స్తువుల విష‌యంలో మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు.. పాత నాణేలు అని చెప్ప‌వ‌చ్చు. పాత కాలం నాటి నాణేల‌కు మార్కెట్‌లో ఎంతో విలువ ఉంటుంది. వీటిని సేక‌రించేవారు ఎంతైనా వెచ్చించి కొనేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. క‌నుక ఇలాంటి పాత కాలం నాణేలు ఉంటే ఎవ‌రైనా స‌రే ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదించ‌వ‌చ్చు. ఇక కింద ఇచ్చిన చిత్రాన్ని ఒక‌సారి చూడండి.

కింద ఇచ్చిన చిత్రంలో ఓ నాణెం ఉంది చూశారు క‌దా. దాన్ని బ్రిటిష్ వారి కాలంలో ముద్రించారు. దానిపై 1885 అని ఉంది. అప్ప‌ట్లో బ్రిటిష్ వారు ఇండియాను పరిపాలించిన‌ప్పుడు వారు ఈ నాణేల‌ను ముద్రించి చెలామ‌ణీలోకి తెచ్చారు. అయితే ఈ నాణెం చాలా అరుదైంది. దీన్ని ఆన్‌లైన్ లో విక్ర‌యించ‌డం ద్వారా ఎవ‌రైనా స‌రే భారీ మొత్తంలో డ‌బ్బుల‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ నాణేన్ని ఎలా విక్ర‌యించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

if you have this coin then you can sell it for huge price

ముందుగా ఇండియామార్ట్ అనే సైట్‌లోకి వెళ్లాలి. అందులో అకౌంట్ రిజిస్ట‌ర్ చేసుకోవాలి. త‌రువాత మీ ద‌గ్గ‌ర ఉన్న నాణేనికి చెందిన ఫొటోల‌ను క్లియ‌ర్‌గా తీసి వాటిని ఆ సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ధ‌ర ఎంతో చెప్పి నాణేన్ని అమ్ముతున్న‌ట్లు రిక్వెస్ట్ పెట్టాలి. దీంతో యాడ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీ యాడ్‌ను చూసిన వారు మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తారు. ధ‌ర ఓకే అనుకుంటే మీరు నిర్దేశించుకున్న మొత్తానికి ఈ నాణేన్ని అమ్మ‌వ‌చ్చు. ఇలా పాత నాణేలు, క‌రెన్సీ నోట్ల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం త‌రుణంలో ఇది ఒక వ్యాపారం అయింది.

ఇక పాత నాణేలు, క‌రెన్సీ నోట్ల‌ను విక్ర‌యించేందుకు ఎలాంటి క‌మిష‌న్లు, ఫీజులు అవ‌స‌రం లేదు. ఎవరైనా అలా తీసుకుంటే త‌మ‌కు ఫిర్యాదు చేయాలని.. ఆర్‌బీఐ గ‌తంలోనే తెలియ‌జేసింది. క‌నుక పాత నాణేలు, నోట్ల‌ను అమ్మి ఇలా స్వ‌యం ఉపాధిని కూడా పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts