vastu

Feng Shui Coin : ఈ నాణెం మీ వ‌ద్ద ఉంటే.. అదృష్టం మీ వెంటే.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Feng Shui Coin : మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో కొంద‌రికి ల‌క్ ఎల్ల‌వేళ‌లా క‌ల‌సి వ‌స్తుంటుంది. దీంతో వారు ఏం చేసినా అందులో విజ‌యం సాధిస్తారు. అయితే కొంద‌రికి మాత్రం ఎంత క‌ష్ట‌ప‌డి ప‌నిచేసినా ల‌క్ క‌ల‌సి రాదు. ఏ ప‌నిలోనూ విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. పైగా ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అలాంటి వారు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన విధంగా కాయిన్‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. దీంతో వారు ఏం చేసినా విజ‌యం సాధిస్తారు. ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం మ‌న‌కు మార్కెట్‌లో ఫెంగ్ షుయ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి భిన్న రకాలుగా ఉంటాయి. వాటిలో ఏ నాణేల‌ను అయినా స‌రే కొని తెచ్చి ముందుగా ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. దీంతో వాటిపై ఉండే నెగెటివ్ ప్ర‌భావం పోతుంది. త‌రువాత ఆ కాయిన్స్‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ప‌లు భిన్న ప్ర‌దేశాల్లో ఉంచ‌డం వ‌ల్ల భిన్న‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇంట్లో ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌కు దారం క‌ట్టి వేలాడ‌దీయాలి. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ రాదు. ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో ఇంట్లో ఉండే అంద‌రికీ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. క‌ష్టాలు త‌ప్పుతాయి. ఇక ఇంట్లో ధ‌నం ఉంచే చోట లేదా మ‌హిళ‌లు హ్యాండ్ బ్యాగుల్లో, పురుషులు ప‌ర్సుల్లో ఒక ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచుకోవాలి. దీంతో వారు ధ‌నం బాగా సంపాదిస్తారు. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఏ ప‌ని చేసినా ఆటంకం లేకుండా స‌జావుగా పూర్త‌వుతుంది. అన్ని విధాలుగా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. ధ‌న‌వంతులు అవుతారు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

if you have this feng shui coin then you will be lucky

దంప‌తులు ఇంట్లో బెడ్ రూమ్‌లో ఏదైనా షెల్ఫ్‌లో లేదా టేబుల్ మీద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారి మ‌ధ్య ఉండే క‌ల‌హాలు, గొడ‌వ‌లు త‌గ్గుతాయి. వారి దాంప‌త్యం అన్యోన్యంగా సాగుతుంది.

వ్యాపారులు అయితే త‌మ కార్యాల‌యాల్లో లేదా ప‌నిచేసే చోట‌, ఉద్యోగులు అయితే త‌మ డెస్క్ వ‌ద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారు ఆయా రంగాల్లో రాణిస్తారు. వ్యాపారుల‌కు వ్యాపారంలో క‌ల‌సి వ‌స్తుంది. లాభాలు సంపాదిస్తారు. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. అదే ఉద్యోగుల‌కు అయితే కెరీర్‌లో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకుంటారు. ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగాలు సాధిస్తారు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. ఇలా ఫెంగ్ షుయ్ కాయిన్స్‌ను భిన్న విధాలుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts