Vitamin B6 : మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ లో బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఒకటి. శరీరాన్ని బలంగా, ఉంచడంలో, నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉండచంలో ఇవి ఎంతో అవసరమవుతాయి. నాగరికత పేరు చెప్పి ప్రతి ఆహారాన్ని మనం పాలిష్ పట్టి తీసుకోవడం వల్ల ధాన్యాల పై పొరల్లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని తవుడులో వెళ్లి పోతూ ఉంటాయి. కనుక మనం తీసుకునే ఆహారాల ద్వారా బి కాంప్లెక్స్ విటమిన్స్ తక్కువగా అందుతాయి. దీంతో చాలా మంది విటమిన్ బి 6 ( పైరాడాక్సిన్) లోపం తలెత్తుతుంది. బి 6 లోపించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అసలు విటమిన్ బి 6 వల్ల మనకు శరీరానికి కలిగే లాభాలు ఏమిటి… ఇది లోపించడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి..మన శరీరానికి ఎంత మోతాతులో ఈ విటమిన్ అవసరమవుతుంది.. ఏఏ ఆహారాల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది..అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్ర రక్తకణాలు సరైన ఆకారంలో ఆరోగ్యంగా తయారవ్వడానికి విటమిన్ బి 6 ఎంతగానో అవసరమవుతుంది. అలాగే మనం సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు గాబా, సెరిటోనిన్ అనే కొన్ని రకాల హ్యాపీ హార్మోన్లు తయారవుతాయి. ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో విటమిన్ బి 6 మనకు అవసరమవుతుంది. విటమిన్ బి6 లోపించడం వల్ల ఈ హ్యాపీ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటివి పెరిగిపోతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి మన దరి చేరకుండా మనసు ప్రశాంతంగా, హాయిగా ఉండాలంటే మనకు విటమిన్ బి6 ఎంతగానో అవసరమవుతుంది. అలాగే శరీరంలో యాంటీ బాడీస్ ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో కూడా మనకు విటమిన్ బి 6 అవసరమవుతుంది. ఎంత ఎక్కువగా యాంటీ బాడీస్ ఉత్పత్తి అయితే మన రక్షణ వ్యవస్థ అంత ఆరోగ్యంగా, అంత ధృడంగా ఉంటుంది.
అదే విధంగా మనం తీసుకునే ఆహారాల్లో ఉండే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో కూడా విటమిన్ బి 6 మనకు సహాయపడుతుంది. శరీరంలో తగినంత విటమిన్ బి 6 ఉంటేనే ప్రోటీన్లు ఆమైనో యాసిడ్లుగా మారి మన శరీరానికి అందుతాయి. అలాగే మనం పీల్చే గాలిలో ఉండే కాలుష్యం నుండి వైరస్, బ్యాక్టీరియాల నుండి గాలితిత్తులను రక్షించడంలో కూడా విటమిన్ బి 6 మనకు అవసరమవుతుంది. ఈ విదంగా విటమిన్ బి6 మన శరీరానికి ఎంతో అవసరమవుతుంది. విటమిన్ బి 6 లోపించడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని మనం కోల్పోవడంతో పాటుగా అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుంది. ఈ విటమిన్ బి6 మనకు ఒక రోజుకు 2 మిల్లీ గ్రాముల మోతాదులో అవసరమవుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు 2.6 మిల్లీ గ్రాముల మోతాదులో అవసరమవుతుంది. అలాగే ఈ విటమిన్ బి6 అనేది నీటిలో కరిగే విటమిన్.
ఇది మన శరీరంలో నిల్వ ఉండదు. దీనిని మనం ఏ రోజుకు ఆ రోజే శరీరానికి అందించాల్సి ఉంటుంది. చిరు ధాన్యాలన్నింటిలోనూ విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. వీటిని పాలిష్ పట్టకుండా వాడుకున్నప్పుడే మన శరీరానికి ఈ విటమిన్ బి6 అందుతుంది. అలాగే 100 గ్రాముల పల్లీల్లో 300 మిల్లీ గ్రాములు, రాజ్మా గింజల్లో 400 మిల్లీ గ్రాములు, సోయా చిక్కుడులో 400 మిల్లీ గ్రాములు, నువ్వుల్లో 800 మిల్లీ గ్రాములు, పొద్దు తిరుగుడు పప్పులో 1.3 మిల్లీ గ్రాములు, పిస్తా పప్పులో 1.7 మిల్లీ గ్రాముల విటమిన్ బి6 ఉంటుంది. ఈ విత్తనాలను, గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల ఇవి త్వరగా జీర్ణమవుతాయి. తెల్లటి పాలిష్ పట్టిన ఆహారాలను తీసుకోవడం మానేసి ఇలాంటి మంచి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి 6 లోపం తలెత్తకుండా ఉంటుందని దీంతో మనం ఈ విటమిన్ లోపించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.