ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అయితే, వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య బంధం బావుండాలన్నా.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా.. వీటిని పాటించడం మంచిది. కొత్తగా పెళ్లయిన జంట కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మంచిది. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఉత్తరం లేదా దక్షిణం వైపు మంచం లేకుండా చూసుకోవాలి. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం వైపు కూడా మంచం లేకుండా చూసుకోవాలి.
మెటల్ మంచాలు కాకుండా చెక్కతో చేసిన మంచాలనే ఉపయోగించడం మంచిది. మంచం కింద ఎప్పుడూ కూడా ఏమీ లేకుండా చూసుకోవాలి. గిఫ్ట్లు లేదంటే సామాన్లు వంటివి పెట్టకూడదు. వీటి వలన పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మంచం కింద దుస్తులు వంటివి కూడా పెట్టకూడదు. అలాగే, బెడ్ రూమ్ కి రంగులని ఎంచుకునేటప్పుడు లైట్ కలర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది.
బెడ్ రూమ్ గోడలకి పెళ్లి ఫోటోలు లేదంటే ఎంగేజ్మెంట్ ఫోటోలు పెట్టడం వలన మీ మధ్య రిలేషన్ బావుంటుంది. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా సరైన దిక్కులో నిద్రపోవడం మంచిది. తల ఎప్పుడు కూడా దక్షిణం లేదంటే పడమర వైపు పెట్టుకుని నిద్రపోవాలి. అప్పుడు నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగవు.