పోష‌కాహారం

జామకాయ ఉప‌యోగాలు తెలుసా.. రోజూ ఒక ముక్క తిన్నా చాలు..!

Guava Pieces : జామ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామకాయ మనకి సులభంగా దొరుకుతుంది కూడా. అన్ని సీజన్స్ లో జామకాయ మనకి అందుబాటులో ఉంటుంది. జామకాయని తీసుకోవడం వలన, చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. జామ వలన కలిగే లాభాల గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం. జామకాయ తినడం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. జామకాయని తింటే, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జామకాయలో విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. జామకాయలో విటమిన్ సి నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

కానీ, చాలామందికి ఈ విషయం తెలియదు. విటమిన్ సి జామలో ఎక్కువ ఉంటుంది. దాంతో వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అంటువ్యాధులు, ఇతర రోగాలకి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. జామకాయని తీసుకుంటే, జీర్ణక్రియకు కూడా సహాయం చేస్తుంది. జామకాయల్లో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. జీర్ణ వ్యవస్థని ఇది ఆరోగ్యంగా ఉంచగలదు.

daily one piece of guava is very much beneficial

జామకాయలలో మూడు గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది. పేగు కదలికలని నియంత్రించడానికి సహాయం చేస్తుంది. మలబద్ధకం సమస్య కూడా జామకాయను తీసుకోవడం వలన తగ్గిపోతుంది. జామకాయ గుండెని కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉంచుతుంది. పొటాషియం ఇందులో ఉండటం వలన, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటుని కూడా కంట్రోల్ చేయగలదు.

జామకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ తో పోరాడుతుంది. జామ చర్మ ఆరోగ్యన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. విటమిన్ సి కూడా జామలో ఉంటుంది. కాబట్టి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. జామ ని తీసుకుంటే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారగలదు. చర్మం అందంగా ఉంటుంది. ఇలా జామ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి.

Share
Admin

Recent Posts